ఇటీవలనే రాజకీయాల్లోకి చేరిన బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ స్వదేశంలో ఓటర్లను ఆకర్షించేందుకు బదులుగా, వచ్చే నెలలో దక్షిణాఫ్రికాలో జరిగే ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు అధికార పార్టీ తరపున ప్రచారం చేసేందుకు సన్నద్ధమయ్యారు. ఈ మేరకు దక్షిణాఫ్రికాలో అధికారంలో ఉన్న ఏఎన్సీ ఆహ్వానం మేరకు ఏఫ్రిల్ 22న జరిగే ఎన్నికల ప్రచారానికి, పలు బహిరంగ సభల్లో ప్రసంగించేందుకుగానూ మున్నాభాయ్ ఒప్పుకున్నారు.