ఆస్ట్రేలియాలో భారతీయులపై రోజురోజుకీ పెరిగిపోతున్న జాత్యహంకార దాడులపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు భారత ప్రభుత్వానికి అక్షింతలు వేసిన సుప్రీం ధర్మాసనం... విద్యార్థులపై దాడుల నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా, దాడులు ఏ మాత్రం ఆగటం లేదని, అలాంటప్పుడు ఎన్ని చర్యలు తీసుకుని ఏం ప్రయోజనమని ప్రశ్నించింది.రక్షణ కోసం చర్యలు తీసుకోవటంలో ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టిన ధర్మాసనం... ముఖ్యమైన ఈ సమస్యను చుట్టచుట్టి ఒక మూలన పడవేయలేమని వ్యాఖ్యానించింది. కాగా, ఈ నెల మొదటివారంలో దాడుల అంశమై అఫిడవిట్ దాఖలుకు కోర్టు ఆదేశించగా ప్రభుత్వం సమర్పించింది.ఈ సందర్భంగా... దాడులను ఆపేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవటం లేదని అటార్నీ జనరల్ తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇదే అంశంపై సవివరంగా మరో అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. |