ప్రధాన పేజి > ఇతరాలు > ఎన్.ఆర్.ఐ. > ప్రత్యేక వార్తలు > "నాట్స్" ద్వితీయ ద్వైవార్షిక సమావేశాలు 2011లో...!!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
"నాట్స్" ద్వితీయ ద్వైవార్షిక సమావేశాలు 2011లో...!!
FILE
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ద్వితీయ ద్వైవార్షిక సమావేశాలను 2011వ సంవత్సరంలో న్యూజెర్సీలో నిర్వహించనున్నట్లు నాట్స్ కార్యనిర్వాహక వర్గం ప్రకటించింది. అమెరికా ఇండిపెండెన్స్ డే వారంతపు రోజులైన 2011 జూలై 1-3 తేదీన మధ్యన ఈ సమావేశాలను నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు వారు వెల్లడించారు.

ఈ సందర్భంగా నాట్స్ అధ్యక్ష, బోర్డు డైరెక్టర్లు మాట్లాడుతూ... అమెరికాలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎక్కడ, ఏ కార్యక్రమం జరిగినా తెలుగువారు అత్యధిక సంఖ్యలో హాజరవుతున్నారని, దీనికి నిదర్శనమే "అమెరికా తెలుగు సంబరాలు" అని అన్నారు. ఈ కార్యక్రమానికి లభిస్తున్న స్పందనను దృష్టిలో ఉంచుకునే తాము తదుపరి ద్వైవార్షిక సమావేశాల కోసం న్యూజెర్సీని ఎంచుకున్నట్లు వారు వివరించారు.

ఇదిలా ఉంటే... 2009 జూలై 2 నుంచి జరుగనున్న నాట్స్ తెలుగు సంబరాల ఏర్పాట్లపై నాట్స్ అధ్యక్ష, బోర్డు డైరెక్టర్ల బృందం తమ సంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ సంబరాలలో పాల్గొనేందుకు అనేకవేలమంది తెలుగువారు ఉత్సాహంగా తమ పేర్లను నమోదు చేసుకున్నారని వారు వెల్లడించారు.

ఈ మేరకు ఉత్తర అమెరికా వ్యాప్తంగా నివసిస్తున్న తెలుగువారందరూ సంబరాల వేదికయిన ఓర్లాండోకు ఉత్సాహంగా తరలి వస్తున్నారని నాట్స్ బృందం తెలియజేసింది. తాము నిర్వహిస్తున్న అమెరికా తెలుగు సంబరాలకు తెలుగువారి నుంచి ఇంత పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తుండటంతో తమకు చెప్పలేనంత ఆనందాన్ని కలిగిస్తోందని నాట్స్ కార్యనిర్వాహకవర్గం హర్షాతిరేకాలను వ్యక్తం చేసింది.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
నేపాల్‌లో అరెస్టయిన భారతీయులకు విముక్తి
"ప్రథమ్"కు భారతీయుల విరాళం
ఎన్నారై శాస్త్రవేత్తకు అరుదైన గౌరవం
"స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్"గా పరమ్‌జీత్ సింగ్
ఆగని ఘోరాలు : మరో విద్యార్థిపై దాడి
"యేల్" శిక్షణ ఓ గొప్ప అనుభూతి : ఎంపీల బృందం