భారత్‌లో జన్మించి అమెరికాలో స్థిరపడిన మరో భారతీయుడికి అరుదైన గౌరవం దక్కిది. అమెరికాలోని మన్‌హట్టన్‌కు కొత్త అటార్నీగా ప్రీత్ భారారాని నియమిస్తూ యూఎస్ సెనేట్ ఆమోదించింది. బెర్నాడ్ ఎల్. మెడాఫ్‌కు సంబంధమున్న వేల కోట్ల డాలర్ల "పాంజీ కుంభకోణాన్ని" వెలుగులోకి తెచ్చినందుకుగానూ భారారాను ఈ పదవి వరించింది.
న్యాయవాద వృత్తిని, రాజకీయాలను మిళితం చేయకుండా.. రెండింటికీ సరిసమాన ప్రాధాన్యం ఇస్తున్న ప్రీత్ భారారా వ్యవహార శైలిని పరిశీలించిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ప్రీత్‌ను అటార్నీ జనరల్‌గా నియమించినట్లు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనంలో వెల్లడించింది.
కాపిటల్ హిల్స్‌లో న్యాయవాదిగా భారారా మంచిపేరు సంపాదించుకున్నారని కొలంబియా యూనివర్సిటీలోని ప్రొఫెసర్ డానియల్ సి. రిచ్‌మెన్ తెలియజేశారు. కాగా... ప్రీత్ భారత్‌లోని ఫిరోజ్‌పూర్‌లో జన్మించారు. 1970లో ఆనంద్ తన తల్లిదండ్రులు అమెరికాలో స్థిరపడటంలో ఆయన కూడా అక్కడే పెరిగారు. 1990 హర్వార్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టాను, 1993లో కొలంబియా లా స్కూల్‌నుంచి పట్టాను ఈయన అందుకున్నారు.