ప్రత్యేక వార్తలు | ఎన్.ఆర్.ఐ. మహిళలు
ప్రధాన పేజి » ఇతరాలు » ఎన్.ఆర్.ఐ. » ప్రత్యేక వార్తలు » బెలీజ్ రాయబారిగా వినయ్ ప్రమాణ స్వీకారం (NRI | special news | Belize | america, Ambassador | Barack Obama | Vinai Thummalapally)
 
OBAMA
FILE
బెలీజ్ అమెరికా రాయబారిగా తెలుగుతేజం, ప్రవాసాంధ్రుడు వినయ్ కె తుమ్మలపల్లి ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు బారక్ హుస్సేన్ ఒబామాకు అనుకూలంగా ప్రచారం చేసినందుకు గుర్తింపుగా ఈ పదవిని ఇస్తున్నట్లు ఒబామా ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే..!

ప్రమాణ స్వీకారం అనంతరం వినయ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... ఒక తెలుగువాడికి ఈ పదవి దక్కటం చాలా అరుదైన విషయమనీ సంతోషం వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచి ఇచ్చిన ఈ బాధ్యతకు పూర్తిగా న్యాయం చేకూరుస్తానని, తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి, తెలుగు ప్రజల బాగోగుల కోసం కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా తెలుగు ప్రజానీకానికి హామీనిచ్చారు.

ఇదిలా ఉంటే.. 1979 మరియు 1985 సంవత్సరాల మధ్యకాలంలో లాస్‌ఏంజెల్స్‌లోని ఓక్సిడెంటల్ కాలేజీలోనూ, తరువాత న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీలోనూ వినయ్, ఒబామాలు విద్యనభ్యసించారు. ఈ సమయంలోనే వీరిద్దరూ స్నేహితులై ఒకే రూమ్‌లో కలిసి ఉన్నారు. కాగా.. బెలీజ్ అమెరికా రాయబారిగా అత్యున్నత గౌరవాన్ని దక్కించుకున్న తొలి ఆంధ్రుడయిన వినయ్.. మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి చెందినవారు కావడం మనకు గర్వకారణం.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.