ప్రధాన పేజి » ఇతరాలు » ఎన్.ఆర్.ఐ. » ప్రత్యేక వార్తలు » కేరళీయులను తిరిగి పంపించేశాం : జోసఫ్ జార్జి (NRI | Special News | Bahrain | Indians | Joseph George | Gulf Air Airplane | Keralites)
నకిలీ వీసాలతో బహ్రెయన్‌లో అరెస్టయిన ఏడుగురు భారతీయులను స్వదేశానికి పంపించివేశామని.. అక్కడి భారత రాయబారి జోసఫ్ జార్జి వెల్లడించారు. కేరళ ప్రాంతానికి చెందిన ఈ ఏడుగురు యువకులను గల్ఫ్ ఎయిర్ విమానంలో భారత్‌కు పంపించినట్లు ఆయన వివరించారు.
కాగా... ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికి ఈ కేరళీయులను మోసం చేసిన ఏజెంట్లు ప్రస్తుతం పరారీలో ఉన్నారని.. వారిని పట్టుకునేందుకు స్థానిక పోలీసు యంత్రాంగం ప్రయత్నిస్తోందని జోసఫ్ పేర్కొన్నారు. ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకుంటామని ఆయన ఈ సందర్భంగా హామీనిచ్చారు.
ఇదిలా ఉంటే.. ఉద్యోగం కోసం కేరళ ప్రాంతం నుంచి బహ్రెయిన్ వచ్చిన ఈ యువకుల వద్ద ఉన్న వీసాలు నకిలీవని తేలడంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. 21-23 సంవత్సరాల వయసున్న ఈ యువకు ఎలక్ట్రీషియన్లుగా, ఆఫీస్ బాయ్‌లుగా పనిచేసేందుకు వచ్చినట్లు చెప్పారు. అయితే లేని కంపెనీ పేరుతో వీసాలను సృష్టించిన ఏజెంట్ ఈ యువకులను మోసం చేశాడు.