ప్రత్యేక వార్తలు | ఎన్.ఆర్.ఐ. మహిళలు
ప్రధాన పేజి » ఇతరాలు » ఎన్.ఆర్.ఐ. » ప్రత్యేక వార్తలు » న్యూజీలాండ్‌లో ఎన్నారైలచే మరో "తాజ్" (Special News | New Zealand | Taj Mahal | Auckland Suburban | New North Road | Kanu Patel)
Feedback Print Bookmark and Share
 
TajMahal
FILE
ప్రవాస భారతీయులు కొంతమంది కలసి 20 మిలియన్ డాలర్ల వ్యయంతో న్యూజిలాండ్ నగరంలో తాజ్‌మహల్‌ను పోలిన కట్టడాన్ని నిర్మించేందుకు సన్నద్ధమయ్యారు. ఈ కట్టడాన్ని అక్లాండ్ సబర్బన్, న్యూ నార్త్ రోడ్‌లో గల మహాత్మాగాంధీ సెంటర్‌లో నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు.

ఈ విషయమై మహాత్మాగాంధీ సెంటర్ ఛైర్మన్ కను పటేల్ న్యూజిలాండ్ హెరాల్డ్ పత్రికతో మాట్లాడుతూ... భారతీయ చరిత్రను, సంస్కృతిని ప్రతిబింబించే విధంగా తాము ఈ తాజ్‌మహల్ నమూనా కట్టడాన్ని నిర్మించేందుకు పూనుకున్నట్లు తెలిపారు. ఇది న్యూజిలాండ్‌లో నివసిస్తున్న ప్రవాస భారతీయులందరికీ గర్వకారణమని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

ఈ కట్టడం పూర్తిగా మార్బుల్స్‌తోనూ, లోపలి భాగంలో ప్రత్యేకంగా బంగారపు పూతతో ఈ కట్టడం నిర్మితమవుతుందని కను పటేల్ వివరించారు. ఇందుకుగాను మహాత్మాగాంధీ సెంటర్ 6 మిలియన్ డాలర్లను సమకూర్చనుందనీ.. అలాగే అక్లాండ్ ఇండియన్ అసోసియేషన్ 1.9 మిలియన్ డాలర్లను ఇవ్వనుందని ఆయన తెలిపారు.

తాజ్‌మహల్‌ను పోలి ఉండే ఈ కట్టడం నిర్మాణానికి అవసరమైన విరాళాల సేకరణకు ఈ నెల నుంచి తీవ్రంగా కృషి చేయనున్నట్లు పటేల్ పేర్కొన్నారు. ఈ భవన నిర్మాణం కేవలం అక్లాండ్ సిటీలోని ప్రవాస భారతీయుల కోసం మాత్రమే కాదనీ.. ఇదో పర్యాటక ప్రాంతంగా కూడా గుర్తింపు పొందుతుందన్నారు. ఈ కారణంతోనే తమకు స్థానిక ప్రభుత్వం, ఛారిటీల నుంచి గట్టి మద్ధతు లభిస్తోందని పటేల్ వెల్లడించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.