ప్రత్యేక వార్తలు | ఎన్.ఆర్.ఐ. మహిళలు
ప్రధాన పేజి » ఇతరాలు » ఎన్.ఆర్.ఐ. » ప్రత్యేక వార్తలు » అంగరంగ వైభవంగా "టాంటెక్స్" దీపావళి వేడుకలు (Special News | Telugu Association Of North Texas | TANTEX | Diwali | Celebrations | Yules)
Feedback Print Bookmark and Share
 
Diwali
FILE
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (టాంటెక్స్) ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. యూలెస్‌లోని ట్రినిటీ హైస్కూల్‌ ఆడిటోరియంలో నిర్వహించిన ఈ సంబరాలకు భారీ ఎత్తున ప్రవాసాంధ్రులు హాజరయ్యారు. సంప్రదాయ విందు తర్వాత అమెరికా జాతీయ గీతాలాపనలతో వేడుకలు ఆట్టహాసంగా ప్రారంభమయ్యాయి.

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్షుడు కోమటి జయరాం ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంబరాల్లో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన నృత్య కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే ప్రముఖ సినీ నేపథ్య గాయనీగాయకులు ఆలాపించిన పాటలు శ్రోతలను ఉర్రూతలూగించాయి.

అలాగే.. దర్శకుడు వీఎన్ ఆదిత్య ఆధ్వర్యంలో హాస్యనటులు వేణు, వెంకీ ఇచ్చిన ప్రదర్శన సంబరాల్లో నవ్వుల పువ్వులు పూయించింది. అనంతరం టాంటెక్స్ అధ్యక్షుడు డాక్టర్ శ్రీధర్ కొర్సపాటి మాట్లాడుతూ... సంస్థ ఇప్పటివరకు చేపట్టిన అనేక కార్యక్రమాల గురించి వివరాలను వెల్లడించారు. చివరిగా వందన సమర్పణతో దీపావళి వేడుకలు విజయవంతంగా ముగిశాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.