ప్రధాన పేజి » ఇతరాలు » ఎన్.ఆర్.ఐ. » ప్రత్యేక వార్తలు » యూకే తెలుగువారి కోసం తాల్ "న్యూస్ లెటర్" (Special News | UK | Telugu People | Newsletter | Telugu Association of London | TAL, Madhava)
యూకేలో తెలుగువారికి సంబంధించిన సమాచారంతో ఓ "న్యూస్ లెటర్"ను ఏర్పాటు చేయనున్నట్లు లండన్ తెలుగు సంఘం (తాల్) ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ విషయమై తాల్ సాంస్కృతిక కార్యదర్శి మాధవ్ తురుమెళ్ల మాట్లాడుతూ.. మొదటి న్యూస్ లెటర్‌ను త్వరలోనే ప్రచురించనున్నట్లు తెలిపారు.
ఇందుకోసం యూకేలో నివసిస్తున్న ప్రవాసాంధ్రులందరి నుంచి రచనలను ఆహ్వానిస్తున్నట్లు మాధవ్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. స్థానిక కార్యకలాపాలకు సంబంధించిన వార్తా కథనాలు, కథలు, కవిత్వం, వ్యాసరచన, కార్టూన్స్, డ్రాయింగ్స్, పెయింటింగ్స్, ముగ్గులు తదితరాలను తమకు పంపించాలని ఆయన కోరారు.
అలాగే పలు రంగాలలో ప్రతిభ కనబరిచి చిన్న పిల్లల వివరాలు, వివిధ వర్గాలు చేపట్టిన సంఘ సేవా కార్యక్రమాలు, వ్యాపార విజయాలు, ఉత్తమ మహిళలు తదితర అనేక అంశాలను వ్యాసాలు, కథనాల రూపంలో తమకు పంపించాలని మాధవ్ ఆహ్వానించారు. కాగా.. అన్ని రకాల రచనలను ఎడిటర్ అట్‌ది రైట్ ఆఫ్ తాలక్ డాట్ ఆర్గ్‌కి పంపించాలని.. రచనల్ని పంపేవారు వారి చిరునామాను స్పష్టంగా తెలియజేయాలని ఆయన కోరారు.