ప్రత్యేక వార్తలు | ఎన్.ఆర్.ఐ. మహిళలు
ప్రధాన పేజి » ఇతరాలు » ఎన్.ఆర్.ఐ. » ప్రత్యేక వార్తలు » "హౌసింగ్ అలవెన్స్" వివాదంలో పాల్‌కు ఊరట..! (Special News | House Allowance | House of Lords | NRI industrialist Lord Swraj Paul | Michael Pownall)
Feedback Print Bookmark and Share
 
Swaraj Paul
FILE
హౌస్ అలవెన్స్‌కు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత సంతతికి చెందిన ప్రముఖ ఎన్నారై పారిశ్రామిక వేత్త, "హౌస్ ఆఫ్ లార్డ్స్" డిప్యూటీ స్పీకర్ స్వరాజ్ పాల్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. పాల్‌తో సహా 19 మంది పార్లమెంట్ సభ్యులను ఈ వివాదం నుంచి బయటపడేయాలని హౌస్ ఆఫ్ లార్డ్స్ తీర్మానించింది.

ఈ వివాదంపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి మైఖేల్ పౌనాల్.. పార్లమెంట్ సభ్యులపై ప్రధానంగా వచ్చిన ఆరోపణలకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై గైడ్‌లైన్స్‌లో ప్రస్తావనే లేదు కాబట్టి.. అందరినీ విడిచిపెట్టాలని తేల్చిచెప్పారు. కాగా.. ప్రధానమంత్రి గోర్డన్ బ్రౌన్‌కు మిత్రుడు, లేబర్ పార్టీ మద్ధతుదారుడైన పాల్.. హౌసింగ్ అలవెన్స్ కింద ప్రభుత్వం నుంచి 38 వేల పౌండ్లను రాబట్టినట్లు బ్రిటీష్ మీడియా ఆరోపించిన సంగతి తెలిసిందే..!

అదే విధంగా హౌస్ అలవెన్సుల్లో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పార్లమెంట్ సభ్యులు భారీగా అవకతవకలకు పాల్పడ్డారని కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ వివాదానికి సంబంధించి పలువురు నేతలు విచారణ ఎదుర్కోగా.. ఇదే వివాదం వల్ల కొంతమంది మంత్రులు రాజీనామాలకు కూడా పాల్పడ్డారు. అయితే ఈ వివాదాన్ని విచారించిన న్యాయమూర్తి, ఆరోపణలపై తీసుకోవాల్సిన చర్యలు.. గైడ్‌లైన్స్‌లో ప్రస్తావించలేదని తేల్చిచెప్పటంతో పాల్‌తోపాటు మిగతా నేతలంతా హాయిగా ఊపిరిపీల్చుకున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.