ప్రధాన పేజి » ఇతరాలు » ఎన్.ఆర్.ఐ. » ప్రత్యేక వార్తలు » మమ్మల్నీ పలుకరించండి మన్మోహన్ జీ...! : ఎన్నారైలు (Special News | George Bush | Dallas | Prime Minister | Doctor Manmohan Singh | Newyork | Washington | Maago)
జార్జిబుష్‌తో పాటు తమను పలుకరించేందుకు డల్లాస్ రావాలని భారత సంతతి ప్రజలంతా.. భారత ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బుష్ సొంత నగరమైన డల్లాస్‌లో వేలాదిమంది భారత సంతతి ప్రజలు నివసిస్తున్నారు. దీంతో ఈ నగరాన్ని సందర్శించాలని ప్రవాస భారతీయులంతా ప్రధానికి ఆహ్వానం పంపించారు.
ఈ విషయమై డల్లాస్‌లోని భారత సంతతికి చెందిన సాంఘిక కార్యకర్త అశోక్ మాగో మాట్లాడుతూ.. అమెరికా పర్యటనల్లో భాగంగా న్యూయార్క్, వాషింగ్టన్ నగరాలను తప్ప ఇతర నగరాలను పర్యటించిన భారత ప్రధానులు ఇప్పటిదాకా లేరన్నారు. అయితే ఇందుకు భిన్నంగా అమెరికాలోని ఇతర నగరాలను సందర్శించాలని ప్రధానికి విజ్ఞప్తి చేస్తూ ఆహ్వానం పంపించామని తెలిపారు.
భారత్, అమెరికాల మధ్య కుదిరిన పౌర అణు ఒప్పందంలో డల్లాస్ కీలక పాత్ర వహించిన సంగతిని ఈ సందర్భంగా మాగో గుర్తు చేశారు. ఇదిలా ఉంటే.. న్యూఢిల్లీలో జరగనున్న "హిందూస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్"లో పాల్గొనేందుకు భారత్ వస్తున్న బుష్‌కు మన్మోహన్ విందు ఇవ్వనున్నారు. కాగా.. అమెరికా అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తరువాత బుష్ భారత్‌లో పర్యటించనుండటం ఇదే ప్రథమం కావడం గమనార్హం.