ప్రత్యేక వార్తలు | ఎన్.ఆర్.ఐ. మహిళలు
ప్రధాన పేజి » ఇతరాలు » ఎన్.ఆర్.ఐ. » ప్రత్యేక వార్తలు » సౌదీలో ఎన్నారై షేక్ ఖాన్ న్యాయపోరాటం (Special News | Saudi Arabia | Sheikh Khawaja Mohiuddin | Madina | General Court | Prison)
Feedback Print Bookmark and Share
 
తనను అక్రమంగా జైలుపాలు చేసినందుకు నష్టపరిహారం చెల్లించాలంటూ... సౌదీ అరేబియాలోని ప్రవాస భారతీయుడు షేక్ ఖాజా మొహియుద్దీన్ న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. ఓ దొంగతనం కేసులో షేక్ కాజాకు మదీనాలోని ప్రధాన కోర్టు 12 సంవత్సరాల క్రితం జైలుశిక్షను విధించింది.

అయితే.. 9 సంవత్సరాల శిక్షాకాలం పూర్తయిన తరువాత షేక్ ఖాజాను విడుదల చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ప్రధాన కోర్టు ఆదేశాలను లెక్కచేయని సౌదీ అరేబియా రీజినల్ గవర్నరేట్ కోర్టు అతడిని మరో మూడు సంవత్సరాల పాటు అదనంగా జైల్లోనే ఉంచింది.

ఇటీవలనే జైలు నుంచి విడుదలయిన మొహియుద్దీన్ ఈ విషయంపై కోర్టును ఆశ్రయించాడు. తన శిక్షాకాలం పూర్తయిన తరువాత కూడా అక్రమంగా మరో మూడు సంవత్సరాలపాటు జైల్లో ఉంచినందుకు.. తగిన నష్టపరిహారం ఇవ్వాలని అతను న్యాయస్థానాన్ని వేడుకుంటున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.