ప్రత్యేక వార్తలు | ఎన్.ఆర్.ఐ. మహిళలు
ప్రధాన పేజి » ఇతరాలు » ఎన్.ఆర్.ఐ. » ప్రత్యేక వార్తలు » భారత్-సౌదీ వాణిజ్య సంబంధాలు మరింత పటిష్టం..! (Special News | India | Saudi | Riyadh | Central Minister | Pranab Mukherjee | Abdullah Zainal Alireza | Visa)
Feedback Print Bookmark and Share
 
Pranab
FILE
భారత్-సౌదీ దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోవటంతోపాటు.. పలు రంగాలలో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా రియాద్‌లో జరిగిన "ఇండో-సౌదీ సంయుక్త కమీషన్" ఎనిమిదవ వార్షిక సదస్సులో... వ్యాపారవేత్తలకు ఉపయోగపడేలా బహుళ ప్రయోజన వీసాలను జారీ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చాయి.

సదస్సులో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి ప్రణబ్ ముఖర్జీ సౌదీ వాణిజ్యశాఖా మంత్రి అబ్దుల్లా జైనల్ అలైరిజాతో చర్చలు జరిపారు. రెండు దేశాల నడుమ సాగుతున్న వాణిజ్యాన్ని మరింతగా పెంచాలని ఈ సందర్భంగా వారు నిర్ణయం తీసుకున్నారు. అలాగే.. రెండు దేశాల మధ్య వ్యాపారవేత్తలు తరచుగా ప్రయాణించేందుకు వీలుగా బహుళ ప్రయోజన వీసాలను జారీ చేసేందుకు కూడా వారు అంగీకారం తెలిపారు.

ఇంకా ఈ సమావేశంలో వీసాల జారీతోపాటు.. పెట్టుబడులు, కార్మికుల భద్రత, చమురు, గ్యాస్, శాస్త్ర సాంకేతిక రంగాలలో పరస్పర సహకారం.. తదితర అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ప్రణబ్ మీడియాతో మాట్లాడుతూ.. సౌదీ-భారత్‌ల మధ్య సరికొత్త బంధాలకు ఈ సదస్సు నాంది పలకనుందని అన్నారు. ఇందులో తీసుకున్న నిర్ణయాల అమలు, పర్యవేక్షణలకు ఓ ప్రత్యేక వ్యవస్థను నెలకొల్పాలని నిశ్చయించామని మంత్రి తెలియజేశారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.