ప్రధాన పేజి » ఇతరాలు » ఎన్.ఆర్.ఐ. » ప్రత్యేక వార్తలు » భారతీయులకు మలేషియా పౌరసత్వం : రజాక్ (Special News | Malaysia | India's | Prime Minister | Naiib Tun Razak | MAICC Party | Application)
మలేషియాలో నివసిస్తున్న 2,220 మంది భారతీయులకు త్వరలోనే మలేషియా పౌరసత్వం, శాశ్వత చిరునామాలను కల్పించేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపిందని.. ప్రధానమంత్రి నజీబ్ తున్ రజాక్ ప్రకటించారు. ఎంఏఐసీసీఐ పార్టీతో ఇటీవల నిర్వహించిన విందు సమావేశంలో భాగంగా ప్రధాని పై విధంగా చెప్పారు.
యోగవంతమైన జీవితాన్ని గడిపేందుకు భారతీయులు ఎంతగానో కష్టిస్తారనీ.. అంతేగాక దేశాభివృద్ధిలో గణనీయమైన పాత్రను పోషించారని ఈసందర్భంగా రజాక్ కొనియాడారు. శాశ్వత నివాసం కోసం మొత్తం 3,335 అప్లికేషన్లు రాగా.. 2,220 అప్లికేషన్లపై ప్రభుత్వం ఆమోదముద్ర వేసిందని ఆయన తెలిపారు.
మిగిలిన దరఖాస్తుల అంగీకారానికి సంబంధించిన చర్యలను కూడా వెంటనే ప్రారంభించాలని హోంశాఖను ఆదేశించినట్లు రజాక్ పేర్కొన్నారు. అలాగే.. రిజిస్ట్రేషన్ సందర్భంగా భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని హోంమంత్రికి ఆయన సూచించారు.
ఇదిలా ఉంటే... మలేషియాలో ఎంతోమంది నిర్దిష్టజాతికి చెందిన భారతీయులు తమ నూతన సంతానం వివరాలను నమోదు చేయించక పోవటంతో... పిల్లలు పాఠశాలల్లో చేరేందుకు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయంలో ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయులకు ప్రధాని చేసిన తాజా ఆదేశాలు కొంత ఊరట నిస్తాయని చెప్పవచ్చు.