ప్రధాన పేజి » ఇతరాలు » ఎన్.ఆర్.ఐ. » ప్రత్యేక వార్తలు » తెలుగు యువత కోసం "తానా" సాంస్కృతిక కార్యక్రమాలు (Special News | North America | Telugu Youth | Cultural Programs | TANA | President | Komati Jayaram)
ఉత్తర అమెరికాలో నివసిస్తున్న తెలుగు యువత ప్రతిభా, సామర్థ్యాలను వెలికితీసేందుకుగానూ పలు సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీలను నిర్వహించనున్నట్లు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఒక ప్రకటనలో వెల్లడించింది. తెలుగువారందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆ సంస్థ విజ్ఞప్తి చేసింది.
కాగా.. రాబోయే రోజుల్లో టీవీ9, మాటీవీ వారి సహకారంతో క్విజ్, డిబేట్, మిమిక్రీ, డ్యాన్స్, కామెడీ, మైమ్, పాటల పోటీలను నిర్వహించనున్నట్లు తానా తన ప్రకటనలో వివరించింది. ఈ పోటీల విజేతలను 2011వ సంవత్సరంలో జరిగే తానా మహాసభల్లో ఘనంగా సత్కరిస్తాని ఆ సంస్థ పేర్కొంది.
ఈ సందర్భంగా తానా అధ్యక్షుడు కోమటి జయరాం మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు ప్రజల కోసం పలు స్వచ్ఛంద కార్యక్రమాలను చేపట్టామని చెప్పారు. ఇందులో భాగంగా ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో సంభవించిన వరదల కారణంగా నష్టపోయిన బాధితులకు చేతనైన సహాయాన్ని అందించామన్నారు. అలాగే.. దాతల నుంచి సేకరించిన లక్ష డాలర్ల విరాళాలను వరద బాధితులకు శాశ్వత ప్రయోజనం కలిగేలా వినియోగించనున్నామని ఆయన చెప్పారు.