ప్రధాన పేజి » ఇతరాలు » ఎన్.ఆర్.ఐ. » ప్రత్యేక వార్తలు » అమెరికాలో భారతీయ విద్యార్థులదే హవా...!! (Special News | America | Abroad Students | College | University | Indians | Institute of International)
ఆర్థికమాంద్యం ప్రపంచాన్ని ముప్పతిప్పలు పెడుతున్నా.. అమెరికాలో ఈ సంవత్సరం కూడా భారతీయ విద్యార్థుల హవా మాత్రం కొనసాగుతూనే ఉంది. అమెరికన్ కాలేజీలు, వర్శిటీలలో చేరిన విదేశీ విద్యార్థుల్లో భారతీయులే అగ్రస్థానంలో నిలిచారనీ.. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషన్ ఎడ్యుకేషన్ (ఐఐఈ) విడుదల చేసిన ఓ నివేదికలో వెల్లడించింది.
అలాగే అమెరికన్ వర్సిటీలలో చేరుతున్న విదేశీ విద్యార్థుల్లో సైతం వరుసగా ఎనిమిదేళ్లుగా భారతీయ విద్యార్థులే ప్రథమస్థానంలో కొనసాగుతున్నట్లు ఐఐఈ పేర్కొంది. ఈ ఏడాది వివిధ అమెరికన్ యూనివర్సిటీల్లో రికార్డు స్థాయిలో 1,03,260 మంది భారతీయ విద్యార్థులు చేరటమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు.
ఇదిలా ఉంటే.. అమెరికాలోని విదేశీ విద్యార్థుల్లో భారతీయ విద్యార్థుల తరువాత 98,510 సంఖ్య చైనా, 75,065తో దక్షిణ కొరియా విద్యార్థులు రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. అమెరికన్ కాలేజీలు, వర్సిటీల్లో ఈ సంవత్సరం మొత్తంమీదా 6,71,616 మంది విదేశీ విద్యార్థులు చేరారు. అయితే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం విదేశీ విద్యార్థుల సంఖ్యలో 8 శాతం పెరుగుదల నమోదు కాగా.. అందులో భారతీయ విద్యార్థుల సంఖ్యలో 9 శాతం పెరుగుదల నమోదయ్యింది.