ప్రధాన పేజి » ఇతరాలు » ఎన్.ఆర్.ఐ. » ప్రత్యేక వార్తలు » ఆస్ట్రేలియాలో ఆగని దారుణాలు : భారతీయ జంటపై దాడి (Special News | Australia | Racist Attacks | India | Melborne | Bundoora | Rodney Raj | Rathna)
ఆస్ట్రేలియాలో జాత్యహంకార దాడులు రోజు రోజుకూ పెచ్చుమీరి పోతున్నాయి. దాడుల నివారణకు భారత్-ఆస్ట్రేలియా దేశాలు ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా ఫలితం కనిపించటం లేదు. తాజాగా మెల్‌బోర్న్ శివార్లలో నివసిస్తున్న ఓ భారతీయ జంటపై ముగ్గురు ఆస్ట్రేలియన్లు దాడికి పాల్పడ్డారు.
మెల్‌బోర్న్ శివార్లలోని బుండూరా ప్రాంతంలో ఉంటున్న రాడ్నీ రాజ్, ఆయన భార్య రత్నపై ముగ్గురు ఆస్ట్రేలియన్లు దాడి చేశారు. ఈ దాడికి పాల్పడిన వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారని బాధితులు పేర్కొన్నారు. నవంబర్ 14 రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో తమపై దాడి జరిగిందని వారు వెల్లడించారు.
ఇనుప రాడ్లతోనూ, కుర్చీతోను దుండగులు తమను చావబాదారాని రాడ్నీ రాజ్, ఆయన భార్య రత్నలు వాపోయారు. తనపై దాడి జరుగుతుండగా, లోపలి నుంచి భార్య వచ్చిందనీ.. గుంపులోని ఇద్దరు యువతులూ ఆమె దుస్తులు లాగేందుకు ప్రయత్నించారని రాజ్ వివరించారు. అయితే పోలీసులు ఇప్పటిదాకా ఈ ఘటనను ధ్రువీకరించలేదని ఆ దేశ మీడియా పేర్కొంది.