ప్రత్యేక వార్తలు | ఎన్.ఆర్.ఐ. మహిళలు
ప్రధాన పేజి » ఇతరాలు » ఎన్.ఆర్.ఐ. » ప్రత్యేక వార్తలు » ఎన్నారై రాబీ మార్టిన్స్‌కు అరుదైన అవకాశం (Special News | Britan | Indian-Origin | Rabi Martins | Liberal Democrats Party | Goa | Pune)
Feedback Print Bookmark and Share
 
Nri Man
FILE
బ్రిటన్‌లో ప్రవాస భారతీయుడు ఒకరికి ఓ అరుదైన అవకాశం లభించింది. భారత సంతతికి చెందిన రాబీ మార్టిన్స్.. లిబరల్ డెమోక్రాట్స్ పార్టీ సలహాదారుగా నియమితులయ్యారు. జాతి సమానత్వం, భిన్నత్వం.. తదితర అంశాలపై ఆ పార్టీ కార్యవర్గానికి తగిన సలహాలు, సూచనలు ఇచ్చేందుకుగానూ మార్టిన్స్‌ను ఆ పదవి వరించింది.

గోవాలో జన్మించిన రాబీ మార్టిన్స్ పూణేలో విద్యను అభ్యసించి.. బ్రిటన్‌లోని గోవా ప్రవాస భారతీయుల్లో ప్రముఖుడిగా ఎదిగారు. బ్రిటన్ రాజకీయాలు, కమ్యూనిటీ వ్యవహారాల్లో పలు పదవులను అలంకరించిన ఈయనను తాజాగా లిబరల్ డెమోక్రాట్స్ పార్టీ సలహాదారు పదవి వరించింది.

ఈ సందర్భంగా రాబీ మాట్లాడుతూ... పార్టీ తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని, పార్టీ ఎజెండా ప్రకారమే నడుచుకుంటానని పేర్కొన్నారు. రాబీ తమ పార్టీకి కీలక సభ్యుడని, లిబరల్ డెమోక్రాట్స్ పార్టీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్రిస్ ఫాక్స్ అన్నారు. ఫెడరల్ కార్యవర్గం, మైనారిటీ విభాగాలతో సహా పార్టీకి చెందిన పలు శాఖల్లో రాబీ సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నారని ఆయన వివరించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.