ప్రత్యేక వార్తలు | ఎన్.ఆర్.ఐ. మహిళలు
ప్రధాన పేజి » ఇతరాలు » ఎన్.ఆర్.ఐ. » ప్రత్యేక వార్తలు » కెనడా బిజినెస్ వీసాల మంజూరు ప్రక్రియ వేగవంతం (Special News | India | Canada | Express Business Visa | Prime Minister | Stephen Harper | Immigration)
Feedback Print Bookmark and Share
 
Nris
FILE
భారత్‌తో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించుకునేందుకు... కెనడా, ఎక్స్‌ప్రెస్ బిజినెస్ వీసాల మంజూరు ప్రక్రియను వేగవంతం చేసింది. కొత్తగా ప్రకటించిన సరళీకృత వీసా విధానం కింద దరఖాస్తు చేసుకున్న 24 గంటల వ్యవధిలోనే భారతీయ వ్యాపారులకు వీసాలను మంజూరు చేసే దిశగా కెనడా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

భారత్-కెనడా వాణిజ్య మండలి ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కెనడా ఇమ్మిగ్రేషన్ మంత్రి జాసన్ కెన్నీ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ వీసా విధానం వల్ల.. ఎక్స్‌ప్రెస్ బిజినెస్ వీసాలు పొందిన భారతీయ వ్యాపారులు కెనడాకు ఎన్నిసార్లయినా సరే వచ్చి పోయేందుకు వీలుంటుందన్నారు. భారత్‌తో అణు ఇంధన సహకారం, పెట్టుబడుల పరిరక్షణ ఒప్పందం తదితర అంశాలపై చర్చలు జరుపుతున్నామని కెన్నీ వివరించారు.

తాము భారత్‌లో మూడు వాణిజ్య కార్యాలయాలను ఏర్పాటు చేశామనీ, కెనడాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్యను రెట్టింపు చేశామని ఈ సందర్భంగా కెన్నీ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. కెనడా ప్రధాని స్టీఫెన్ హార్పర్ భారత్ పర్యటన నేపథ్యంలో ఆ దేశం తాజా వీసా విధానాన్ని ప్రకటించటం గమనించదగ్గ విషయం.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.