ప్రత్యేక వార్తలు | ఎన్.ఆర్.ఐ. మహిళలు
ప్రధాన పేజి » ఇతరాలు » ఎన్.ఆర్.ఐ. » ప్రత్యేక వార్తలు » లండన్‌లో భారతీయ చిన్నారిపై దాడి (Special News | Berkshire | Maria Sharma | mugger | paris | punched | Sunny | UK | London)
Feedback Print Bookmark and Share
 
Attack
FILE
భారత సంతతికి చెందిన రెండు సంవత్సరాల చిన్నారిపై దాడి సంఘటన లండన్‌లోని భారతీయుల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ అమానుష చర్య బెర్క్‌షైర్‌లోని స్లాగ్‌లోని అనే ప్రాంతంలోని రద్దీగా ఉండే ఒక రోడ్డుపై జరిగింది. మారియా శర్మ అనే 28 సంవత్సరాల మహిళ తన కవల పిల్లలైన పారిస్, సన్నీలను బయటకు తీసుకెళ్తుండగా.. దుండగుడు ఒకడు అటకాయించి ఆమె పర్సును దొంగిలించేందుకు ప్రయత్నించాడు.

అయితే అతన్ని మారియా అడ్డుకోవటంతో.. చిన్నారి పారిస్ ముఖంపై పిడిగుద్దు కురిపించి దుండగుడు అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ దుండగుడి దాడిలో ఇద్దరు పిల్లలు గాయపడగా... పారిస్ పెదవి చిట్లి రక్తం కారటంతోపాటు, ముఖమంతా గీరుకుపోయింది. దాడి తరువాత తేరుకున్న మారియా తన ఇద్దరు పిల్లల్ని దగ్గర్లో గల వెక్సామ్ పార్క్ హాస్పిటల్‌కు చికిత్స కోసం తీసుకెళ్లినట్లు డెయిల్ మెయిల్ తన కథనంలో తెలిపింది.

అనంతరం మారియా దగ్గర్లోని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దుండగుడు మామూలుగానే ఉన్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు డెయిలీ మెయిల్ వివరించింది. దుండగుడు నల్లజాతీయుడు కాగా... అతడికి 20 సంవత్సరాల వయస్సులోపే ఉండవచ్చునని మారియా తెలిపింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.