ప్రధాన పేజి » ఇతరాలు » ఎన్.ఆర్.ఐ. » ప్రత్యేక వార్తలు » ఐఎంఎఫ్ కార్యదర్శిగా భారతీయ ఆర్థిక నిపుణుడు (Special News | International Monetary Fund's | Executive Board | Secretary | Dominique Strauss-Kahn)
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) కార్యదర్శిగా భారతీయ ఆర్థిక నిపుణుడు సిద్ధార్థ్ తివారీ నియమితులయ్యారు. ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ డామినిక్ స్ట్రాస్ కాన్.. సిద్ధార్థ్‌ను ఈ పదవికి ఎంపిక చేశారు. ఐఎంఎఫ్ లక్ష్యాలలో కీలకమైన ఏకాభిప్రాయ సాధనలో తివారీకి తగిన నైపుణ్యాలు, విశేషానుభవం ఉన్నాయని స్ట్రాస్ ఈ సందర్భంగా విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఆర్థిక సంక్షోభం లాంటి గడ్డు కాలంలో సైతం సిద్ధార్థ్ బడ్జెట్, ప్రణాళికా విభాగం డైరెక్టర్‌గా సమర్థవంతమైన సేవలను అందించారని స్ట్రాస్ కొనియాడారు. కాగా.. ప్రస్తుతం తివారీ బడ్జెట్, ప్రణాళికా విభాగం డైరెక్టర్‌గా సేవలందిస్తున్నారు. ఐఎంఎఫ్‌లో గత ఇరవై సంవత్సరాలుగా వివిధ హోదాలలో కొనసాగుతున్న ఈయన.. ఢిల్లీ వర్సిటీ నుంచి ఎకనమిక్స్ డిగ్రీ అందుకున్నారు.
ఆ తరువాత లండన్ వర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీని, షికాగో వర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టాను పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా తివారీ మీడియాతో మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి ఇంత పెద్ద బాధ్యతను అప్పగించినందుకు, తన బాధ్యతలను మరింత సమర్థవంతంగా జరిగేలా చూస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు.