ప్రత్యేక వార్తలు | ఎన్.ఆర్.ఐ. మహిళలు
ప్రధాన పేజి » ఇతరాలు » ఎన్.ఆర్.ఐ. » ప్రత్యేక వార్తలు » బ్రౌన్ ఓ చెత్త ప్రధాని: ప్రవాస లేబర్ అభ్యర్థి సూద్..!! (Britain | Gordon Brown | Labour Party | Indian Origin | Manish Sood | People | Queen Elizabeth)
Bookmark and Share Feedback Print
 
Nri News
FILE
బ్రిటన్ చరిత్రలో ప్రస్తుతం ప్రధానిగా పనిచేస్తున్న గార్డెన్ బ్రౌన్ ఓ చెత్త ప్రధాని అంటూ.. లేబర్ పార్టీకి చెందిన ప్రవాస భారతీయ అభ్యర్థి మనీష్ సూద్ విమర్శల వర్షం కురిపించారు. బ్రిటన్‌కు ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో 38 సంవత్సరాల సూద్, తమ పార్టీకే చెందిన ప్రధానిపై విమర్శలు ఎక్కుపెట్టడంతో, ఆ పార్టీ నాయకత్వం తలలు పట్టుకుని కూర్చున్నట్లు తెలుస్తోంది.

వాయువ్య నార్‌ఫోల్క్ ప్రాంతం నుంచి లేబర్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగనున్న ఇండియన్ ఆరిజన్ మనీష్ సూద్.. ప్రస్తుత ప్రధాని గార్డెన్ బ్రౌన్‌పై ఎక్కుపెట్టిన విమర్శనాస్త్రాలను స్థానిక పత్రికలు కథలు కథలుగా ప్రచురిస్తున్నాయి. వలస విధానంతో సహా, వివిధ రంగాల్లో బ్రౌన్ చేపట్టిన చర్యలవల్లనే లేబర్ పార్టీ ప్రాబల్యం తగ్గిపోయిందని ఈ సందర్భంగా సూద్ దుయ్యబట్టారు.

లేబర్ పార్టీ వైభవం కోల్పోయేందుకు కారకుడిగా నిల్చిన బ్రౌన్.. దేశ ప్రజానీకానికి, రాణి ఎలిజబెత్‌కు క్షమాపణలు చెప్పాలని ఈ మేరకు మనీష్ సూద్ డిమాండ్ చేశారు. జాతీయ బీమా కంట్రిబ్యూషన్లను పెంచటం, పెరుగుతున్న పెట్రో ధరలను అదుపు చేయలేకపోవటం లాంటి కారణాలన్నీ.. ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ లేబర్ పార్టీ ప్రాబల్యాన్ని గణనీయంగా తగ్గించేస్తున్నాయని ఆరోపించారు.

కాగా.. లీసెస్టర్ నగరానికి ఆసియన్ సంతతికి చెందిన తొలి మేయర్ అయిన మంజులా సూద్ కుమారుడైన మనీష్ సూద్ ప్రస్తుతం కౌన్సిలర్‌గా పనిచేస్తున్నారు. మరోవైపు ఎన్నికల ప్రచారంలో భాగంగా సూద్ మాట్లాడుతూ.. ఎన్నికలలో తనను గెలిపించినట్లయితే మూలవేతనాలను తిరిగి వచ్చేలా చూస్తాననీ నియోజకవర్గ ప్రజలకు హామీఇచ్చారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.