ప్రధాన పేజి » ఇతరాలు » ఎన్.ఆర్.ఐ. » ప్రత్యేక వార్తలు » బ్రిటన్ ఎంపీగా ప్రవాస భారతీయుడు అలోక్ శర్మ (Britain | Parliamentary Elections | Indian Origin | Alok Sharma | MP | Agra | Conservative Party | Labour Party)
బ్రిటన్‌లో ఇటీవల జరిగిన యూకే పార్లమెంటరీ ఎన్నికలలో విజయం సాధించిన ప్రవాస భారతీయుడు అలోక్ శర్మ ఎంపీగా ఎన్నికయ్యారు. భారత్‌లోని ఆగ్రాలో జన్మించిన అలోక్, బ్రిటన్‌లోని బెర్క్‌షైర్ నియోజకవర్గం నుంచి కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. లేబర్ పార్టీ అభ్యర్థి నజ్ సర్కార్‌పై అలోక్ 6,004 ఓట్లకు పైబడి మెజారిటీని సాధించి ఎంపీ సీటును గెల్చుకున్నారు.
కాగా.. అలోక్ వర్మ ఎంపీగా ఎన్నికైన సంగతి తెలుసుకున్న అతని సొంత ఊరు ఆగ్రాలో ప్రజలు సంబరాలు జరపుకుంటున్నారు. నగరంలోని కోథి మీనా బజార్ ఏరియాలోని వర్మ స్వగృహంలో ప్రార్ధనలు నిర్వహించిన అనంతరం స్వీట్లు పంచి సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆగ్రా నగరంలోని రాజా కి మండీ రైల్వే స్టేషన్‌లో డిప్యూటీ స్టేషన్ మాస్టర్‌గా పనిచేస్తున్న శర్మ సోదరుడు విశ్వనాథ్ మాట్లాడుతూ.. స్వల్ప స్థాయిలో జాత్యహంకారం కలిగి ఉన్న బ్రిటీష్ సమాజంలో, కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థిగా టికెట్ సంపాదించటం అంత సులభమైన విషయం కాదనీ అన్నాడు. అలాంటిది తన సోదరుడు టికెట్ సంపాదించటమేగాక, ఫలితాలలో రికార్డు స్థాయిలో విజయం సాధించటం అభినందించదగ్గ అంశమని సంతోషం వ్యక్తం చేశాడు.
అలోక్ కుటుంబం యూకేలో స్థిరపడ్డప్పటికీ తరచుగా ఆగ్రా వచ్చి, తమను కలుస్తుంటారని విశ్వనాథ్ వివరించారు. గత డిసెంబర్ నెలలోనే తమ వద్దకు వచ్చిన అలోక్, తమ స్వగ్రామం అలిగర్హ్‌లో ఓ చారిటబుల్ ఆసుపత్రిని నిర్మించే యోచనలో ఉన్నట్లు చెప్పారన్నారు. అలోక్ ప్రజలు మెచ్చిన నాయకుడేకాకుండా, అతనో మంచి రచయితగా అందరికీ సుపరిచితుడని విశ్వనాథ్ ఈ సందర్భంగా వెల్లడించారు.