ప్రత్యేక వార్తలు | ఎన్.ఆర్.ఐ. మహిళలు
ప్రధాన పేజి » ఇతరాలు » ఎన్.ఆర్.ఐ. » ప్రత్యేక వార్తలు » ప్రవాసాంధ్రుడికి ప్రతిష్టాత్మక "ఎల్లిస్ ఐలాండ్ అవార్డు" (New York | Long Island | Indian American | Rao S Anumolu, Ellis Island Medal, America)
Bookmark and Share Feedback Print
 
Nri News
FILE
న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్‌కు చెందిన ప్రవాసాంధ్రుడు, ఇండియన్ అమెరికన్ రావ్ ఎస్. అనుమోలు ప్రతిష్టాత్మక "ఎల్లిస్ ఐలాండ్ అవార్డు"కు అందుకున్నారు. అమెరికా అభివృద్ధి కోసం తన వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వహించినందుకుగానూ.. ప్రవాస భారతీయులకు యూఎస్ ప్రభుత్వం అందించే అత్యున్నత పౌరసత్వ పురస్కారం అయిన ఈ ఎల్లిస్ ఐలాండ్ అవార్డు రావ్‌ను వరించింది.

కాగా.. గతంలో ఈ అవార్డును అందుకున్నవారిలో ఆరుగురు అమెరికా అధ్యక్షులు ఉండటం విశేషం. అలాగే వ్యాపార రంగంలోనూ, విద్యా రంగంలోనూ, కళలు, క్రీడలు, ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న పలువురు నోబెల్ అవార్డు గ్రహీతలు మరియు నాయకులు ఈ అవార్డును అందుకున్న వారిలో ఉన్నారు.

ఇదిలా ఉంటే.. లాంగ్ ఐలాండ్‌లోని న్యూయార్క్ కేంద్రంగా నడిచే ఏఎస్ఆర్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్‌ సీఈఓగా విధులు నిర్వహిస్తున్న రావ్ ఎస్. అనుమోలు మే 8వ తేదీన ఎల్లిస్ ఐలాండ్ పురస్కారాన్ని స్వీకరించారు. అనేకమంది ప్రతినిధులు హాజరైన ఓ ప్రత్యేక కార్యక్రమంలో రావ్‌కు ఈ పురస్కారాన్ని అందజేశారు.

భారత్‌లోని ఆంధ్రప్రదేశ్‌లో జన్మించిన అనుమోలు 1969వ సంవత్సరంలో యూఎస్‌కు తరలివెళ్లారు. అక్కడే ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్ డిగ్రీని అందుకున్న అనుమోలు, చికాగోలోని ఇల్లినాయిస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎంబీఏ పట్టాను సైతం అందుకున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీ మరియు వార్టన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్‌కు చెందిన డిఫెన్స్ సిస్టమ్స్ మేనేజ్‌మెంట్ కళాశాలలో జరిగిన అనేక అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.