ప్రధాన పేజి » ఇతరాలు » ఎన్.ఆర్.ఐ. » ప్రత్యేక వార్తలు » ఎసెక్స్ మ్యూజియంలో హిందూ శిల్పాల ప్రదర్శన..!! (NRI Special News | US Museum | Hindu Gods | Animal Spirits | Essex Museum)
యూఎస్‌లోని పియాబాడీ ఎసెక్స్ మ్యూజియంలో హిందూ శిల్పాల ప్రదర్శన జరుగనుంది. కాగా.. సుమారు 40 హిందూ దేవుళ్ల, దేవతల విగ్రహాలు మరియు జంతు దేవతలు, భారతీయ జానపద సంప్రదాయాన్ని ప్రతిబించే పలు చిత్రాలు ఈ ప్రదర్శనలో సందర్శకులకు కనువిందు చేయనున్నాయి.
"ఫేసెస్ ఆఫ్ డివోషన్: భారతీయ శిల్పాలు" అనే పేరుతో సలెమ్‌లో జరుగనున్న ఈ ప్రదర్శన 2012వ సంవత్సరం జనవరి 16వ తేదీ వరకు కొనసాగనుంది. వివిధ భంగిమలలో ఉన్న శిల్పాలు దాదాపు 1500 నుంచి 1800 వరకు ఈ ప్రదర్శనలో కొలువుదీరనున్నాయి. జానపద కళలకు సంబంధించిన పలు రేఖా చిత్రాలు, సంప్రదాయ హస్తకళలకు సంబంధించిన చిత్రాలను కూడా ఈ ప్రదర్శనలో ఉంచనున్నారు.