మానసికంగా ఆరోగ్యం సరిగాలేని ఓ 20 సంవత్సరాల అమ్మాయిని శారీరక వేధింపులకు గురిచేసిన ఓ ప్రవాస భారతీయుడికి చికాగో న్యాయస్థానం నాలుగు సంవత్సరాల జైలుశిక్షను విధించింది. కాగా.. లాంబోర్డ్‌కు చెందిన 21 సంవత్సరాల శ్రేయా లాల్, 20 సంవత్సరాల వయస్సున్నప్పటికీ ఐదేళ్ల బాలికలా ప్రవర్తించే ఓ అమ్మాయిని సెక్స్ వేధింపులకు గురిచేయటంతో జైలుశిక్ష గురయ్యాడు.
అంతేగాకుండా శిక్షాకాలం పూర్తయ్యాక, జైలునుంచి విడుదలైన తరువాత శ్రేయా లాల్.. "జీవితకాల సెక్స్ అపరాధి"గా భావించబడతాడని న్యాయస్థానం తీర్పునిచ్చింది. మరోవైపు లాల్ అటార్నీ జాన్ డోనాహు డూపేజ్ కౌంటీ న్యాయమూర్తి డానియల్ గ్యుయ్‌రిన్‌తో మాట్లాడుతూ.. లాల్ శారీరక ఆరోగ్యం సరిగా లేదనీ, వైద్యులు అతను కాగ్నిటివ్ రీసనింగ్ డిస్‌ఫంక్షన్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు నిర్ధారించారని వివరించాడు
ఇదిలా ఉంటే.. గత సంవత్సరం 2009, జూన్ 15వ తేదీన మానసికంగా ఆరోగ్యం సరిగాలేని ఓ 20 సంవత్సరాల అమ్మాయిని సెక్స్ కోసం బలవంతం చేశాడన్న ఆరోపణలతో పోలీసులు లాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. లాల్‌తో వేధింపులకు గురైన ఆ అమ్మాయి ప్రస్తుతం తన తల్లితో నివసిస్తోంది. లాల్ వల్ల తనకు, తన కూతురి ప్రాణాలకు ముప్పు ఉంటుందనే భయంతో బాధిత అమ్మాయి తల్లి 2009లో కోర్టు నుంచి ప్రొటెక్టివ్ ఆర్డర్స్ తెచ్చుకోవటం గమనార్హం.