అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి చెందాడు. గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన శశి శేఖర్ బీటెక్‌లో పీహెచ్‌డీ కోసం అమెరికాకు వెళ్లాడు. స్థానిక బెర్లింగ్టన్ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేస్తూ వచ్చిన శేఖర్.. స్నేహితులతో కలిసి సముద్ర స్థానానికి వెళ్లగా ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి చనిపోయాడు.
కుమారుని మరణవార్త తెలుసుకున్న తల్లిదండ్రులు విషాదంలో మునిగి పోయారు. మరి కొద్ది నెలల్లో ఉన్నత చదువులు పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి రావలసిన కుమారుడు పరాయి దేశంలో మరణించడాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు. కాగా, శశి శేఖర్ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ పూర్తి చేయగా, బిట్స్‌పిలానీలో ఎంటెక్ పూర్తి చేశాడు.