ప్రత్యేక వార్తలు | ఎన్.ఆర్.ఐ. మహిళలు
ప్రధాన పేజి » ఇతరాలు » ఎన్.ఆర్.ఐ. » ప్రత్యేక వార్తలు » అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి దారుణ హత్య! (America | Hyd | Students | Bridgefort | MS | NRI)
Bookmark and Share Feedback Print
 
అమెరికాలో హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానిక కనెక్టికట్‌లో ఉన్న స్ట్రాఫోర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఎంఎస్‌ చదువుతున్న అరుణ్‌ కుమార్‌ నరోటే అనే విద్యార్థి కొంతమంది దుండగుల చేతిలో హత్యకు గురయ్యాడు. అరుణ్‌ కుమార్‌ బ్రిడ్జిపోర్ట్‌లోని ఓ దుకాణంలో పార్ట్‌టైం ఉద్యోగం చేస్తున్నాడు.

స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి ఆయన విధుల్లో ఉండగా నల్లజాతీయులైన దుండగులు వచ్చి దోపిడీకి యత్నించారు. వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించగా కాల్పులు జరిపి పారిపోయారు. తీవ్ర గాయాలపాలైన అరుణ్‌ కుమార్‌ అక్కడికక్కడే మృతి చెందారు. అరుణ్‌ హైదరాబాద్‌ శివార్లలోని ఇంద్రారెడ్డి మెమోరియల్‌ కళాశాలలో ఇంజినీరింగ్‌ చదివారు. అతడి కుటుంబం కార్వాన్‌లో నివాసముంటోంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.