ఎన్ఆర్ఐ ఓటింగ్ హక్కుల కోసం అక్టోబర్ 31, 2010 తేదీన శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియాలో నిర్వహించిన ఎన్ఆర్ఐ ఓటింగ్ రైట్స్ డ్రైవ్ విజయవంతమై పండుగ వాతావరణాన్ని తలపించింది. విదేశాలలో ఉంటున్న భారతీయలు పరోక్ష పద్ధతిలో భారత్లో జరిగే ఎన్నికలలో పాల్గొనేందుకు అవకాశం కల్పించాలని డిమాండు చేస్తూ.. ఎన్ఆర్ఐ ఓటింగ్ హక్కుల ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమలో పెద్ద సంఖ్యలో ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మొత్తాన్ని పీపుల్స్ ఫర్ లోక్సత్తా, మానవతా డాట్ ఆర్గ్, ఇండియన్ కమ్యూనిటీ సెంటర్లు సంయుక్తంగా నిర్వహిచారు. ఈ ర్యాలీలో ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ప్రవాస భారతీయులు పాల్గొన్నారు.