పీపుల్ ఫర్ లోక్సత్తా మరియు ఎన్నారైల ఆధ్వర్యంలో లాస్ ఏంజలీస్లోని తెలుగువారందరూ తెలంగాణ సమస్యను త్వరితగతిన పరిష్కరించమని భారత సర్కారుని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. శనివారం(నవంబర్ 19) మద్యాహ్నం 12 గంటలకు లాస్ ఏంజలీస్లోని, ఎన్నారైలు అధికంగా వుండే అర్టీసియా ప్రాంతంలో ర్యాలీ చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సమస్యకు పరిష్కారం కాక గత రెండు సంవత్సరాలుగా ప్రాంతీయ విభేదాలు పెరగటం, రాష్ట్ర అభివృద్ధి కుంటుపడటం, సకల జనుల సమ్మె, ఆత్మహత్యలు, సామాన్య ప్రజలు ఇబ్బందులు గురికావటం జరుగుతోంది. అయినా అధికార పక్షం, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సమస్యని పరిష్కరించే దిశగా స్పష్టమైన అడుగులు వేయటం లేదు. ఈ సమస్యతో రాష్ట్రంలో పరిపాలన కూడా కుంటుపడిపోయింది.