గ్రీటింగ్ కార్డులను జన్మదినం, క్రిస్టమస్, పండుగదినాలు వంటి ప్రత్యేక సందర్భాలలో పరస్పరం అందించుకుంటున్నప్పటికీ, వాటిని కృతజ్ఞతలు చెప్పడానికి, భావోద్వేగాలు, అనుభూతులను పంచుకోవడానికి కూడా ఉపయోగిస్తున్నారు. సాధారణంగా ఎన్వలప్‌లో ఉంచి ఇచ్చే గ్రీటింగ్ కార్డులు పలు రకాల రూపాల్లో ఉంటాయి.
ప్రాచీన కాలం నుంచే గ్రీటింగ్ కార్డులు వాడుకలో ఉంటున్నప్పటికీ ప్రస్తుతం చేతితో తయారు చేసేవి మరియు భారీ స్థాయిలో ముద్రించే రూపంలో ఉంటున్నాయి. సీజన్‌తో సంబంధం లేకుండా నేటికాలంలో వందలాది చిన్న, పెద్ద కంపెనీలు వీటిని తయారు చేస్తున్నాయి. చౌక ధరలకే లభ్యమయ్యే ఈ కార్డులను సంపన్నుల అవసరాలకోసం భారీ ఖర్చుతో కూడా రూపొందిస్తున్నారు.
పాశ్చాత్య సమాజంలోనే కాక ఇతర సాంప్రదాయిక సమాజాల్లో కూడా ప్రజలు సీజన్లవారీగా గ్రీటింగ్ కార్డులను స్నేహితులకు, బంధువులకు పంపిస్తున్నారు. అలాగే వ్యాపార వర్గాలు సైతం తమ కస్టమర్లను సంతృప్తి చేయటానికి గాను ఆయా సందర్భాల్లో గ్రీటింగ్ కార్డులను పంపుతున్నారు. వీటికి మతపరమైన సందేశాలతో కాకుండా హ్యాపీ హాలిడేస్ లేదా సీజనల్ గ్రీటింగ్స్ వంచి రూపాల్లో సందేశాలను రూపొందించి కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు.
మీ ప్రేయసి/ప్రియునికి గ్రీటింగ్ కార్డును పంపాలనుకుంటున్నారా...? అయితే ఇక్కడ క్లిక్ చేయండి... కార్డును పంపండి.
గ్రీటింగ్ కార్డులలోని మహత్తు ఏమిటంటే మనకు సుపరిచితులు లేదా సుదూర తీరాలనుంచి స్నేహితులు, వ్యాపారులు, సంస్థలు గ్రీటింగ్ కార్డులతో కూడిన సందేశాలను పంపిస్తే వచ్చే అనుభూతిని మాటల్లో వర్ణించలేము. మిత్రులకు, ప్రేయసీ ప్రియులకు, సన్నిహితులకు, బంధువులకు ప్రత్యేక సందేశాలు పంపాలంటే గ్రీటింగ్ కార్డులకు మించినవి లేవని ప్రస్తుతం జనాభిప్రాయం. భవిష్యత్తులో ఉత్తరాలు పూర్తిగా అంతరించి సందేశాత్మక శుభాకాంక్షలను గ్రీటింగు కార్డుల ద్వారా పంపడం జరుగుతుందని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు.
|