ప్రధాన పేజి   ఇతరాలు > ప్రేమాయణం > మధుర జ్ఞాపకాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మంచులోకంలో విరిసిన మరుమల్లె
అతనితోపాటు మగ ఫ్రెండ్ మల్లికా సిద్ధమైంది. మూడు రోజులు ప్రయాణంలో తాను పడతినికాదన్న విషయం తెలియకుండా ఉండేందుకు మల్లిక నానా తంటాలు పడింది. చివరికి వారు బసచేయాల్సిన హోటల్‌కు చేరుకున్నారు. ప్రతిరోజూ ఉదయం వ్యాయామం చేసే అలవాటును నరేంద్ర మంచు కొండల్లోనూ సాగించాడు. అలాంటి రోజుల్లో ఓ రోజు.... మగవేషంలో ఉన్న మల్లిక నరేంద్రను అనుసరిస్తోంది.

ఒక్కసారిగా మంచువాన... ఎముకులు కొరికే చలి... సాహస యాత్రలో జయించాలన్న నిశ్చయంలో నరేంద్ర, ఆ మంచువానను లెక్కచేయక మంచు పర్వతాలవైపు వడివడిగా నడుస్తున్నాడు. ఇంతలో పెద్ద కేక... అల్లంత దూరాన ఓ అమ్మాయి మంచువానకు గువ్వలా ఒదిగిపోయి గడగడ వణుకుతోంది. ఒక్క ఉదుటున ఆమెవద్దకు చేరాడు నరేంద్ర.. చిత్రం.... ఆడాళ్లంటేనే అసహ్యంచుకునే నరేంద్ర... ఆ క్షణం..

ఆమె అందానికి దాసుడయ్యాడు. మొదటిసారిగా అతని మోములో ప్రేమ తాలూకు భావనలు మొలిచాయి. చలిగా నటించటాన్ని మల్లిక మరింత ఎక్కువ చేసింది. అంతే అతను తనను తాను మరిచి మల్లికను తన చేతులపై వేసుకుని తన హోటల్ గదివైపు పరుగులు తీయటం ప్రారంభించాడు. అంతలో చటుక్కున అతనిలో ఓ ఆలోచన... తన స్నేహితుడేమయ్యాడా అని...

అతని ఆలోచనను పసిగట్టిన మల్లిక మగస్నేహితుని తాలూకు ఆనవాళ్లను అతని ముందు పరిచింది. నరేంద్ర మరో మాట మాట్లాడే లోపే మంచు వాన మరింత అధికమైంది. మల్లిక మరింత దగ్గరయ్యింది... మధురమైన తన మంచుయాత్రను, మల్లికతో సాగించిన ప్రణయాన్ని ఈసారి తన స్నేహితులతో కాదు.... తన భార్యామణి మల్లికతోనే మళ్లీ మళ్లీ చెపుతూనే ఉన్నాడు నరేంద్ర.
 << 1 | 2   
మరిన్ని
సావిత్రి-సత్యవంతుల ప్రేమ కథ
శకుంతలాదుష్యంతుల ప్రేమకథ
నల-దమయంతుల ప్రేమకథ
ది మోస్ట్ లవ్లీ క్వీన్ లవ్‌స్టోరీ
"ఆమె"ని పెళ్ళి చేసుకున్న"ఆయనగారు" : శ్రీకాంత్‌
ఫెనికి కవి కీట్స్ వ్రాసిన లేఖ