ప్రధాన పేజి > ఇతరాలు > ప్రేమాయణం > మధుర జ్ఞాపకాలు > అడగాలనుందా నీ పూర్ ప్రేమ లేఖల గురించీ...
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అడగాలనుందా నీ పూర్ ప్రేమ లేఖల గురించీ...
WD
ప్రియురాలికి ప్రియుడు రాసే వెచ్చని అక్షరాలు.. చెలికి వెండివెన్నెల రేయినాటి అందాలు... ఆ ప్రేమాక్షరాలు మరువలేని, మరపురాని, మత్తెక్కించి, మైమరిపించి, మరో లోకంలో విహరింపజేసే ప్రేమలేఖలోని ప్రణయాక్షరాలు.

రెండు మనసులు... అయినా భావనలు ఒకటే
రెండు హృదయాలు... అయినా ప్రేమాక్షరాల స్పందన ఒకటే
ఇలా ఇరు ప్రేమ స్పందనలను పొదివి పట్టుకుని తన హృదయంలో దాచుకుని ఇష్ట సఖుడు/సఖి ముందు ఆవిష్కరించే ఆ ప్రేమ లేఖలు... ఉన్నాయా?

ఎన్నాళ్లు... ఎన్నేళ్లు గడిచినా చెరగని ముద్రలా, నిలువెత్తు సాక్ష్యంలా నిలిచిన ఆ ప్రణయ లేఖలు నేడూ ఊసులాడుకుంటున్నాయా...?
ఇలా కవితాత్మక ధోరణితో ఓ ప్రేమలేఖ ప్రియుడు ప్రశ్నాస్త్రాలను సంధిస్తే... మరో మోడరన్ లవ్ బాయ్ ఇలా చెప్పుకొచ్చాడు.

లవ్ వాయిస్ మెయిళ్లుండగా... ప్రేమ లేఖలెందుకురా మాజీ ప్రియుడా
"హలో లవ్" అంటూ సెల్ "సై" అంటుంటే... లవ్ లెటర్సెందుకురా పురాతన ప్రేమికుడా
నెట్ ఉందీ.. పబ్ ఉందీ... డిస్కో థెక్ ఉందీ... ఇవి చాలక.... ఇంకెందుకురా పాతబడిన ప్రేమ లేఖల గొడవ

ప్రేమలేఖలు పట్టుకుని "మై స్వీట్ మెమెరీస్" అంటే అది పాతచింతకాయ ప్రేమ పచ్చడి
పబ్బుల్లో ఊసులాడుతూ మబ్బుల్లో విహరించడం నేటి ఆధునిక "లవ్" పద్ధతి
ఇంకా అడుగాలనుందా నీ పూర్ ప్రేమ లేఖల గురించీ...

అంతే !! ఆ పురాతన ప్రేమికుడు మళ్లీ మాట్లాడితే ఒట్టు. మరి మీరేమైనా మాట్లాడతారా... అయితే మాట్లాడండి ఈ దిగువన ఉన్న బాక్సులో...
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ముద్దిస్తే ఏమవుతుంది..?
ఇకపై ప్రేమను కొనుక్కోవచ్చు...!
కుర్రకారుకు అంత దూకుడెందుకంటే..?
ప్రేమ వ్యక్తీకరణ అశ్లీలమెలా అవుతుంది..?
తొలి ముద్దు..ఓ తియ్యని అనుభూతి
ఊ... ఐ టూ లవ్యూ అన్నారా...?