ప్రధాన పేజి > ఇతరాలు > ప్రేమాయణం > మధుర జ్ఞాపకాలు > తొలి చినుకుల వర్షంలో... తొలిప్రేమ మైకంలో
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
తొలి చినుకుల వర్షంలో... తొలిప్రేమ మైకంలో
Love
FileWD
















చిలిపి తలపులు మదిలో అడుగుపెట్టేవేళ, మనసు తోటలో మొగ్గ తొడిగిన మౌనం విచ్చుకుని పరిమళాలు వెదజల్లేవేళ, అల్లిబిల్లి ఊహలు అల్లరిగా అల్లుకుంటున్నవేళ... తూరుపున విచ్చుకున్న వెలుగులా మనిషి జీవితంలో ప్రవేశించే ఓ మధురమైన బంధం ప్రేమ.

అందుకే మనసులో ఉదయించే ప్రేమ విజయాన్ని సాధిస్తే ప్రపంచాన్ని జయించిన వీరుడిలా మనిషి ఆనందంతో ఊగిపోతాడు. తొలిసారి నింగికెగిరిన పక్షిలా పులకించిపోతాడు. ఆల్చిప్పలో పడిన వాన చినుకు సముద్రగర్భంలో చేరి ముత్యమై మెరిసినట్టు ఆకర్షణతో మొదలైన ప్రేమ ఇరు మనసులను పెనవేసే బంధంగా మారినపుడు ఆ మనిషిపడే ఆనందం వర్ణనాతీతం.

స్వప్నం నిజమైనట్టు, ఆకాశం చేరువైనట్టు, మనసుపొరల్లో గూడుకట్టుకున్న ఆనందం ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంటే... నింగిలోని తారల్ని దండలా గుచ్చి, లోకంలోని పువ్వులన్నింటినీ ఏకం చేసి చెలి దోసిళ్లలో రాసులుగా పోసి పెదవి దాటని భావాన్ని కళ్లతోనే మౌనంగా అక్షరబద్ధం చేస్తుంటే... ఆ క్షణంలో కలిగే భావం కవులు సైతం వర్ణించలేనిది. ఏ భాషలోని పదాలకు అందనిది.

అందుకే ప్రేమ మధురమైనది. ప్రేమ భావం అద్భుతమైనది.. ప్రేమ జనించిన హృదయం నిర్మలమైనది... ఆ ప్రేమను జయించిన జీవితం సార్థకమైనది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
లవ్ ఎట్ ఫస్ట్ సైట్... ఐతే ప్రేమ గుడ్డిదా...?
అడగాలనుందా నీ పూర్ ప్రేమ లేఖల గురించీ...
ముద్దిస్తే ఏమవుతుంది..?
ఇకపై ప్రేమను కొనుక్కోవచ్చు...!
కుర్రకారుకు అంత దూకుడెందుకంటే..?
ప్రేమ వ్యక్తీకరణ అశ్లీలమెలా అవుతుంది..?