ప్రధాన పేజి > ఇతరాలు > ప్రేమాయణం > మధుర జ్ఞాపకాలు > ప్రేమభావం... అర్థం కానివారికి పిచ్చితనమే...?
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ప్రేమభావం... అర్థం కానివారికి పిచ్చితనమే...?
FileFILE
జీవితంలో ప్రేమ ఫలించినప్పుడు స్వప్నం సాకారమైనట్టు కలిగే ఆ మధురమైన అనుభూతిని వర్ణించేందుకు మాటలు చాలవంటే బహుశా అది అతిశయోక్తి కాదేమో. జీవితంలో అప్పటివరకు కలగని ఓ వింత భావన మదిని గిలిగింతలు పెట్టేస్తుంటే మనసు పొరల్లో చిగురించిన ప్రేమ భావాన్ని నిలబెట్టుకునేందుకు మనిషి అనుభవించిన వేదన ఫలించి ప్రేమించినవారు వశమైనప్పుడు కలిగే ఆ ఆనందం వ్యక్తి మనసులో జీవితాంతం నిల్చిపోతుంది.

ఎందుకంటే ఏ వ్యక్తి జీవితంలోనైనా మొదట్లో ప్రేమభావం అంతగా ప్రభావం చూపకున్నా రోజులు గడిచేకొద్దీ ఆ భావం మనసులో బలీయమవుతుంటే ఆ ప్రేమను దక్కించుకోవడానికి ఆ మనిషి పడే తపన క్షణక్షణానికి పెరుగుతుంటుంది. అలాంటి సమయంలో మనసులో చిగురించిన ప్రేమ భావాన్ని ఎదుటివారు అర్థం చేసుకోకున్నా, తమ ప్రేమను అంగీకరించేందుకు వారు నిరాకరించినా సదరు వ్యక్తి పడే వేధన అందరికీ అంత సులభంగా అర్థం కాదు.

అందుకే ఏ బంధంలోనూ లేని వింత పరిస్థితి బహుశా ఒక్క ప్రేమ విషయంలోనే ఉంటుందని చెప్పవచ్చు. ప్రపంచమంతా అనుక్షణం ఏదో ఓ సమస్యతో సతమతమవుతుంటే తాను మాత్రం ప్రేమ ఫలించలేదని బాధపడుతున్నానంటూ ఎవరైన చెబితే వినేవారికి ఆశ్చర్యంతోపాటు కాస్త చికాకూ కలగడం సహజమే. ఎందుకంటే మిగిలిన విషయాల గురించి బాధపడేవారికి ప్రేమ గురించి ఆలోచించేవారిని చూస్తే వీళ్లకేం పనిలేదా... ఎప్పుడూ ప్రేమ... ప్రేమ... అంటూ కలవరిస్తుంటారు అని సులభంగా అనేస్తారు.

అయితే ప్రేమలో పడ్డవారికి మాత్రం తమ ప్రేమ ఫలించకుంటే కలిగే బాధ ఈ ప్రపంచంలో మరెవ్వరికి రాదేమో అన్నంతగా అనిపిస్తుంటుంది. ఎందుకంటే ప్రేమ వ్యవహారమే అంత. దూరంగా ఉండి చూసేటప్పుడు చాలా చిన్నదిగా కనిపించే ప్రేమ వ్యవహారం దానిలో మునిగిపోయినపుడు మాత్రం చాలా పెద్దదిగా అనిపిస్తుంది. అందుకే ప్రేమంటే అదో ప్రత్యేకమైన లోకంగా ప్రేమికులు భావిస్తే... పిచ్చివాళ్లు మాత్రమే ప్రేమ జంజాటంలో ఇరుక్కుంటారు అని ఇతరులు అనుకుంటుంటారు.

ఎవరి ఆలోచనా ధోరణి ఎలా ఉన్నా ప్రేమ అనేదే లేకుండా జీవితం ఉండడం సాధ్యమే కావచ్చుకానీ... ప్రేమతో కూడిన జీవితం వశమైతే మాత్రం సదరు వ్యక్తి జీవితం కచ్చితంగా ఆనందసాగరమై కొనసాగుతుందన్నది మాత్రం నిజం.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
జీవించండి... కలకాలం ప్రేమికుల్లా
ప్రియ నేస్తమా... నను కరుణించవా...?
వలపు మొగ్గ తొడగాలంటే... రెప్పవాల్చకుండా చూస్తే పోలా...!!
తొలి చినుకుల వర్షంలో... తొలిప్రేమ మైకంలో
లవ్ ఎట్ ఫస్ట్ సైట్... ఐతే ప్రేమ గుడ్డిదా...?
అడగాలనుందా నీ పూర్ ప్రేమ లేఖల గురించీ...