ప్రధాన పేజి > ఇతరాలు > ప్రేమాయణం > మధుర జ్ఞాపకాలు > ప్రేమ... చెప్పలేని భావావేశానికి చిరునామా!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ప్రేమ... చెప్పలేని భావావేశానికి చిరునామా!
FileFILE















ఆద్యంతములేని అమరానందమే ప్రేమ... ఏ బంధము లేని అనుబంధమే ప్రేమ... అన్నాడో సినీ కవి. మనసులో ప్రేమభావం చిగురించినపుడు పైన చెప్పినంతటి భావావేశాన్ని ప్రతి ఒక్కరూ ప్రదర్శించలేకపోవచ్చుకానీ, అంతటి భావావేశానికి లోనుకావడం మాత్రం చాలామందికి అనుభవమే.

తల్లి ప్రేమ, సోదరప్రేమ, బంధు ప్రేమ ఇలా ఎన్ని ఉన్నా ఒక వ్యక్తి యవ్వనంలో చిగురించే ప్రేమ మాత్రమే ఇంతటి భావావేశాన్ని కలిగించడానికి ప్రత్యేకమైన కారణమేదైన ఉందా అంటే... మనస్తత్వ శాస్త్రవేత్తలు, అనుభవంతో తలపండినవారు ఎన్నో రకాల కారణాలు చెప్పవచ్చు. అయితే ఎవరెన్ని చెప్పినా ఒక వ్యక్తి మనసులో ప్రేమ చిగురించిన సమయంలో అతను పొందే ఆ అనుభూతి బహుశా ప్రపంచంలోనే వేరెవరూ పొందలేదేమో అనంతగా అతను భావావేశానికి లోనవడం మాత్రం ఎవరి అంచనాలకూ అందదేమో.

అందుకే యుగాలు మారినా, తరాలు మారినా, సంస్కృతులు మారినా, ప్రేమమాత్రం ఏమాత్రం మారకుండా ఈ ప్రపంచంలో మనగలుగుతోంది. మారుతున్నకాలం, పెరుగుతున్న జీవనవేగం, చుట్టుముట్టేస్తున్న ప్రపంచ సంస్కృతి ఇలా ప్రతీ ఒక్కటి ప్రేమపై ప్రభావం చూపినా అంతిమంగా నిజమైన ప్రేమ జనించినపుడు కలిగే అనుభూతి వర్ణించడానికి వీలుకాదనే చెప్పవచ్చు.

ప్రేమకోసం పడే కష్టం కూడా ఇష్టంగా, ప్రేమవల్ల కలిగే బాధ కూడా ఏదో తెలియని ఆనందంగా మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే అలాంటి ప్రేమకోసం ఎంతకైనా తెగించాలి... ఏదైనా చేసేయాలి అని మనిషి అనుకోవడంలో బహుశా తప్పులేదేమో.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ప్రేమభావం... అర్థం కానివారికి పిచ్చితనమే...?
జీవించండి... కలకాలం ప్రేమికుల్లా
ప్రియ నేస్తమా... నను కరుణించవా...?
వలపు మొగ్గ తొడగాలంటే... రెప్పవాల్చకుండా చూస్తే పోలా...!!
తొలి చినుకుల వర్షంలో... తొలిప్రేమ మైకంలో
లవ్ ఎట్ ఫస్ట్ సైట్... ఐతే ప్రేమ గుడ్డిదా...?