ప్రధాన పేజి > ఇతరాలు > ప్రేమాయణం > మధుర జ్ఞాపకాలు > పార్కుల్లో వ్యభిచారమేనా ప్రేమంటే ?
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పార్కుల్లో వ్యభిచారమేనా ప్రేమంటే ?
FileFILE
ప్రేమలేని కామం రాణిస్తుందేమోగానీ... కామంలేని ప్రేమమాత్రం రాణించదు అనేది లోకోక్తి. ఎందుకంటే ఇద్దరు యువతీయువకుల మధ్య జనించిన ప్రేమ ఎంతటి ఉదాత్తమైనదైనా సరే అంతిమంగా వారు శారీరకంగా కూడా ఒకటైనప్పుడే వారిమధ్య ఉన్న ప్రేమబంధం మరింత బలపడుతుందన్నది అందరూ ఒప్పుకేనే సత్యం. అందుకే ఇద్దరు యువతీయువకుల మధ్య ఆకర్షణ, అనుబంధం, అర్థం చేసుకోవడం ఇలా ఏరకంగా ప్రేమ జనించినా చివరకు అది వారిమధ్య ఏర్పడే శారీరబంధంతోనే పరిపూర్ణమవుతంది.
లేటెస్టు ప్రేమలంటే ఇవే మరి...
  ఏ పార్కులోని పొద్ద కాస్త కదిలినా, మసక చీకట్లో బీచ్ ఇసుకలో ఏ రెండు దేహాలు పెనవేసుకున్నా అక్కడ అలాంటి పని చేస్తోంది ఖచ్చితంగా ప్రేమికులేనా ?      


అయితే అంతమాత్రాన కేవలం శారీరక వాంఛను తీర్చుకోవడానికో లేక ఉరకలేసే యవ్యనంలో తప్పుచేయడానికో ప్రేమ ఓ సాధనంగా మారితే మాత్రం అలాంటి ప్రేమ కచ్చితంగా స్వచ్ఛమైనది కాదనే చెప్పవచ్చు. ఇద్దరి మధ్య ప్రేమ అనే భావం చిగురించి జీవితాంతం కలిసి ఉండాలనే తపన ఎక్కువై అందుకోసం పెళ్లి అనే సాంప్రదాయంతో ఒకటై అటుపైన శారీరకంగానూ ఏకమైనప్పుడు మాత్రమే అప్పుడా ప్రేమ పరిపూర్ణత సాధించిందని చెప్పవచ్చు.

కానీ నేటిరోజుల్లో ప్రేమ అనే పేరుతో కొందరు పార్కుల్లో, బీచ్‌లలో వ్యభిచారం సాగించడం నిత్యం చూస్తూనే ఉన్నాం. అలాంటివారు కామవాంఛను తీర్చుకోవడం కోసం తమ మధ్య ఏర్పడిన బంధానికి ప్రేమ అని పేరుపెట్టి ప్రేమికులంటే ఇలాగే ఉంటారేమో అని అందరూ అనుకునే స్థాయికి ప్రేమను దిగజారుస్తున్నారు. ఈ పరిస్థితివల్లే కాబోలు ఏ పార్కులోని పొద్ద కాస్త కదిలినా, మసక చీకట్లో బీచ్ ఇసుకలో ఏ రెండు దేహాలు పెనవేసుకున్నా చూసేవారు మాత్రం అక్కడ అలాంటి పని చేస్తోంది ప్రేమికులేనని ఓ సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు.
FileFILE


కానీ ఓసారి మనసుపెట్టి ఆలోచిస్తే పార్కుల్లోని పొదలమాటున తప్పుచేస్తూ, బీచ్‌లలో మసకచీకట్లో కామకేళి సాగిస్తూ కనిపించేవారంతా ప్రేమికులు కాదు... వారు కేవలం కాముకులు మాత్రమేనని చెప్పేయవచ్చు. ఎందుకంటే నిజమైన ప్రేమ ఎప్పుడూ అర్హతలేని సమయంలో శారీరకంగా సుఖపడాలని కోరుకోదు. అంతేకాదు నిజంగా ప్రేమించి, నిజంగా జీవితంలో ఒకటవ్వాలనుకునేవారు సైతం పెళ్లి కాకుండానే ప్రేమ పేరుతో శారీరక వాంఛ తీర్చుకోవాలని కలలో కూడా ఆలోచించరు. ఒకవేళ ఎవరైనా అలా ఆలోచిస్తే పైన చెప్పినట్టు వారు నిజంగా ప్రేమికులు కాదు కాముకులు మాత్రమే.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
మీ ప్రేమ ఇప్పటికీ స్వచ్చంగానే ఉందా... ?
ప్లాటోనిక్ లవ్... ప్రేమకు కావలసినంత మసాలా
ప్రేమంటే పొందడం కాదు... ఇవ్వడం మాత్రమే ?
ప్రేమ... చెప్పలేని భావావేశానికి చిరునామా!
ప్రేమభావం... అర్థం కానివారికి పిచ్చితనమే...?
జీవించండి... కలకాలం ప్రేమికుల్లా