ప్రధాన పేజి > ఇతరాలు > ప్రేమాయణం > మధుర జ్ఞాపకాలు > ప్రేమ జీవితం... ఓ మధుర జ్ఞాపకం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ప్రేమ జీవితం... ఓ మధుర జ్ఞాపకం
FileFILE
జీవితంలో ఒక్కసారైనా ప్రేమలో పడ్డవారికి, ప్రేమించినవారికి ఆ బంధం జీవితాంతం గుర్తుండిపోయే ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుందనడంలో ఏమాత్రం సందేహం అక్కర్లేదు. యవ్వనం పురివిప్పేవేళ, జీవనగమనంలో ఓ కొత్త తోడు కోసం మనసు ఆరాటపడుతున్న సమయంలో ఎదురయ్యే ప్రేమ భావం సఫలమైనా, విఫలమైనా అటు తర్వాతి జీవితంలో అది ఓ అద్భుతమైన భావంగా మదిలో నిల్చిపోతుంది.

అలా నిల్చిపోయిన ఆ భావం ఏ క్షణం గుర్తుకు వచ్చినా మనసు మొత్తం ఓ మధురమైన భావంతో తడిసిపోకమానదు. అందుకే జీవితంలో ఒక్కసారైనా మనస్పూర్తిగా, ఎలాంటి అరమరికలు లేకుండా, లే దురుద్ధేశ్యాలు లేకుండా రెండు మనసులు ఒకదానితో ఒకటి పెనవేసుకోగలిగినప్పుడు సదరు వ్యక్తుల మధ్య కలిగే ఆ అందమైన అనుభూతి వర్ణించ వీలుకానిది. అంతేకాదు ఏళ్లు గడిచినా ఆ భావం ఓ మలయమారుతంలా మనసును చుట్టుముట్టేస్తూనే ఉంటుంది.

అయితే కేవలం ఓ ఆకర్షణగా మాత్రమే ప్రేమను భావించిన వారికి రోజులు గడిచాక ఆ ప్రేమలో అంతటి లోతు కన్పించకపోవచ్చు. అలాగే వారి ప్రేమలో గుర్తుకువచ్చేంతటి మధురానుభూతులు సైతం కన్పించకపోవచ్చు. కానీ నిజమైన ప్రేమభావం జనించినప్పుడు అది ఏనాటికై ఓ మధుర కావ్యమే.

కాకుంటే అలాంటి ప్రేమ జయించి జీవితంలో ఆ ప్రేమికులిద్దరూ ఒకటైతే ఆ మధుర కావ్యం మరింతగా వెలుగులీనుతుంది. అలాకాక అంతటి అపురూపమైన ఆ ప్రేమ వీలుకాని పరిస్థితుల్లో విఫలమైనా ఆ భావం తాలూకు మధుర స్మృతులు సదరు ప్రేమికుల హృదయాల్లో జీవితం చివరివరకు ఓ అద్భుత భావంగా నిక్షిప్తం కాకపోవు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: ప్రేమాయణం, ఇతరాలు, మధుర జ్ఞాపకం, Others, Romance, Love
మరిన్ని
పార్కుల్లో వ్యభిచారమేనా ప్రేమంటే ?
మీ ప్రేమ ఇప్పటికీ స్వచ్చంగానే ఉందా... ?
ప్లాటోనిక్ లవ్... ప్రేమకు కావలసినంత మసాలా
ప్రేమంటే పొందడం కాదు... ఇవ్వడం మాత్రమే ?
ప్రేమ... చెప్పలేని భావావేశానికి చిరునామా!
ప్రేమభావం... అర్థం కానివారికి పిచ్చితనమే...?