ప్రధాన పేజి > ఇతరాలు > ప్రేమాయణం > మధుర జ్ఞాపకాలు > ఆఫీస్ రొమాన్స్: ముద్దులు.. కౌగిలింతలు...
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఆఫీస్ రొమాన్స్: ముద్దులు.. కౌగిలింతలు...
IVR
WD
కార్యాలయాల్లో రొమాన్స్ నేడు సర్వసాధారణమైందంటున్నారు నిపుణులు. అయితే ఈ శృంగారం కార్యాలయాలకు పెద్ద తలనొప్పిగా తయారవుతోందట. కొన్ని జంటల శృంగారం శృతి మించి రాగాన పడటంతో అది మిగిలిన ఉద్యోగుల దృష్టికి వచ్చి వారిపై ప్రత్యేక చర్చలు, సెటైర్లు వేసుకుంటూ చేసే పని గంటలు తగ్గిపోతున్నాయట.

మరోవైపు పీకల్లోతు శృంగారంలో మునిగిపోయిన సదరు జంట 'కామాతురాణం నభయం, నలజ్జ' చందంగా ప్రవర్తిస్తూ తమ సెల్‌ఫోన్లలో నిమిషానికో మెసేజ్ ఇచ్చుకుంటూ ఆఫీసు కాలాన్ని హరించివేయడం జరుగుతోందట. ఇదిలా ఉంటే కార్యలయంలో కొన్ని జంటలు నెరపే విచ్చలవిడి రొమాన్స్ మూలంగా ఆయా కంపెనీలకు చట్టపరమైన ఇబ్బందులు తలకు చుట్టుకుంటున్నాయట.

ఎన్ని సమస్యలున్నా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎవరు ఎగతాళి చేసినా, ఆఫీస్ రొమాన్స్‌ను సదరు కపుల్స్ ఆపనే ఆపరని రొమాన్స్‌పై పరిశోధనలు చేస్తున్న లండన్ పరిశోధకుల బృందం తేల్చేసింది. ఎందుకంటే 24 గంటల్లో మూడొంతుల జీవితాన్ని ఆఫీసులో గడపడమే ఇందుకు కారణమనీ, సమస్యలలో ఉన్న స్త్రీ/పురుషుడు మరో వ్యక్తితో మనసు విప్పి మాట్లాడుకునే వేదికగా ఆఫీసు మారుతోందంటున్నారు.

అయితే సక్రమమైన రొమాన్స్(పెళ్లితో ముగిసేది) కాక వివాహేతర రొమాన్స్ చాలా చేటు చేస్తోందనీ, అది వారి వ్యక్తిత్వాలపై ప్రభావం చూపి విలువ లేకుండా చేస్తుందనీ, ఫలితంగా సదరు ఉద్యోగి ఉద్యోగం ఊడే పరిస్థితి తలెత్తుతుందంటున్నారు.

ఇదిలా ఉంటే "ఆఫీసులో రొమాన్స్" బయట ప్రపంచానికి తెలియడంతో సదరు ఉద్యోగుల యాజమాన్యపు పరువు ప్రతిష్టలు గంగలో కలిసేదిగా ఉంటుందని తమ పరిశీలనలో తేలిందంటున్నారు. చాలా కంపెనీలు ఇటువంటి అడ్డగోలు ప్రేమాయణాలు తమ దృష్టికి వచ్చినప్పుడు వాటిని అడ్డుకునేందుకు పరోక్ష హెచ్చరికలు చేయడం జరుగుతోందంటున్నారు.
1 | 2  >>  
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
అలాంటి ప్రేమలకోసం తపనెందుకు ?
ప్రేమ జీవితం... ఓ మధుర జ్ఞాపకం
పార్కుల్లో వ్యభిచారమేనా ప్రేమంటే ?
మీ ప్రేమ ఇప్పటికీ స్వచ్చంగానే ఉందా... ?
ప్లాటోనిక్ లవ్... ప్రేమకు కావలసినంత మసాలా
ప్రేమంటే పొందడం కాదు... ఇవ్వడం మాత్రమే ?