ప్రధాన పేజి > ఇతరాలు > ప్రేమాయణం > మధుర జ్ఞాపకాలు > ప్రేమంటే తెలుసా నీకు?
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ప్రేమంటే తెలుసా నీకు?
Gulzar Ghouse
Content consultent
FILE
ప్రపంచంలోని ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒకప్పుడు ప్రేమలో పడే ఉంటారు. వీరిలో అతి కొద్దిమంది మాత్రమే ప్రేమను అర్థం చేసుకుంటారు. ఎవరైతే ప్రేమను అర్థం చేసుకున్నారో అలాంటి వారు తమ జీవితాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దినవారౌతారు.

ప్రస్తుతం ప్రేమ అనే రెండు అక్షరాలు ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి చోట ప్రేమికుల జంట కనపడుతుంటుంది. పార్క్, బీచ్‌లవద్దనైతే మరీనూ...వీరిలో ఎంతమంది తమ ప్రేమను సార్థకం చేసుకుంటారో తెలీదు. అంటే ప్రేమించేవారు పెళ్ళి చేసుకోవాలనుకుంటుంటారు. కాని పరిస్థితుల ప్రభావంతో విడిపోయిన జంటలు చాలానే తారసపడుతుంటాయి.

ప్రేమ చరిత్రపై దృష్టి సారిస్తే లైలా-మజ్నూ, సలీమ్-అనార్కలిలాంటి వారు చాలామంది తమ ప్రేమకు ఉదాహరణగా నిలిచారు. కాని ప్రేమకు సరియైన పరిభాష ఎవ్వరుకూడా చెప్పలేకపోయారు. వీరంతా ప్రేమలో తన్మయులైనవారే. కాబట్టి వీరిని కేవలం ప్రేమ అనే రెండక్షరాలతో ముడివేయలేం. వీరిది అమర ప్రేమ. వీరి ప్రేమ అనంతమైనది. అనిర్వచనీయమైనది.

మీరుకూడా ఎవరినైనా ప్రేమిస్తుంటే, ప్రేమంటే ఏంటో తెలుసుకోవాలని ఉంటుంది. ప్రేమకు పరిభాషను వెతకడం చాలా కష్టం. కాని కొంతమంది ప్రేమకు నిర్వచనాలను ఇలా చెప్పారు.

అవేంటో చూద్దాం...

** నిజమైన ప్రేమ అంటే...ఎవరినైతే తన ప్రేమికుడు/ ప్రేమికురాలిని ప్రేమిస్తుంటారో, వారు తను ప్రేమించేవారినుండి తిరిగి మళ్ళీ అదే ప్రేమను పొందాలనుకోవడం అవివేకం అంటారు ప్రముఖ హిందీ కవి "కబీర్ దాస్"

** కొంతమంది పురుషులు ప్రేమిస్తారు, కాని వారి ప్రేమలో కాసింత గాఢత తక్కువగానే ఉంటుంది, కాని స్త్రీ అలాకాదు, తన ప్రేమ స్థిరంగా ఉంటుంది. ప్రేమించిన వారిని ద్వేషించడం ఎన్నడూ ఎరుగదని ఆచార్య రజనీష్ "ఓషో" అన్నారు.

** ప్రేమ అనేది ఎప్పుడూకూడా తీసుకోవడం ఎరుగదు, దానికి తెలిసిందల్లా ఇవ్వడమే. ప్రేమ అనేది కష్టాన్ని సహిస్తుంది. ప్రేమకు పగ, ప్రతీకారం అనేది తెలియదంటున్నారు జాతిపిత మహాత్మా గాంధీ.

** ప్రేమకు కళ్ళుండవు అది ఎప్పుడూకూడా హృదయంనుంచి మాత్రమే చూస్తుంది, కాబట్టే ప్రేమ గుడ్డిది అన్నారు. అని ప్రముఖ ఆంగ్ల కవి షేక్స్‌పియర్ అన్నారు.

** ఎక్కడైతే ప్రేమ ఉందో అక్కడే నిజమైన జీవితం ఉంది. అని అరస్తు అన్నారు.

** ప్రేమ అనేది త్యాగం, బాధ్యతకు ప్రతిరూపం అని బేకన్ తెలిపారు.

** పువ్వు పరిమళం ఎలాంటిదో ప్రేమకూడా అలాంటిదేనని జార్జ్ బెర్నార్డ్ షా అన్నారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఆఫీస్ రొమాన్స్: ముద్దులు.. కౌగిలింతలు...
అలాంటి ప్రేమలకోసం తపనెందుకు ?
ప్రేమ జీవితం... ఓ మధుర జ్ఞాపకం
పార్కుల్లో వ్యభిచారమేనా ప్రేమంటే ?
మీ ప్రేమ ఇప్పటికీ స్వచ్చంగానే ఉందా... ?
ప్లాటోనిక్ లవ్... ప్రేమకు కావలసినంత మసాలా