ప్రధాన పేజి   ఇతరాలు  ప్రేమాయణం  ప్రేమ కవితలు
 
స్త్రీ పురుష తత్త్వము
మనసు లోపల వలపు తలపుల పూలు నవు్వచు విరియగా!
తనువు తీయని సుఖము కోరును సుధల వానలు కురియగా!!

చూపు తూపులు మదిని నాటగ, కోరికలు మొలకెత్తగా,
సొగసనే పురివిప్పి ప్రకృతి మయూరమాడును మత్తుగా!!

సరససల్లాపాల దేలుచు, మరియుచుందురు జంటగా,
విరసమెఱుగని ప్రేయసీ ప్రియులిరువురును తామొంటిగా!!

ప్రణయలీలా కార్యరతులై సంతసింపుచు మెండుగా,
ప్రళయమందును పరవశించెదరాశలన్నియు పండగా!!

స్త్రీ పురుష తాదాత్మ్య తత్త్వము విశదముగ వివరింపగా,
శ్రీవరుడె శ్రీకృష్ణుడయ్యెను రాధ భక్తి తరింపగా!!!
మరిన్ని
వేడి కోరికలు
తొలి సాహసం
ప్రణయ నౌకలు
వలపురాణి నవ్వులు
శృంగార కవిత
ప్రళయంలో ప్రణయం