జాజిపువ్వు మనసులాంటి బంగారీ జంటగా ఉండాలి ప్రతిక్షణం యిహ మరీ బంతిపువ్వులాంటి ఓ నా బంగారీ బరువు నిండిన బాధ ఎప్పటిదాకో మరీ
స్వర్ణకమలం లాంటి నా బంగారీ స్వంతమవుతావుగా నాకు తెలుసు మరీ ప్రతి సూర్యకిరణంలో నిండిన ఓ నా బంగారీ ప్రతిరోజూ ప్రత్యక్షమవుతాయి నా ముందుమరీ
కలువరాజు పంచే కమ్మని వెన్నెల లాంటి బంగారీ కమ్మగా పంచుతావు నీ చల్లదనాన్ని నాకు మరీ మంచుబిందువులాంటి ఓ నా బంగారీ మనసులో కరిగిపోయావు నాలో మరీ
కలలో ఇలలో అగుపించే ఓ నా బంగారీ కలకాదు! నిను మరువలేను సారీ!
- యిమ్మడిశెట్టి వెంకటేశ్వరరావు
|