ప్రధాన పేజి > ఇతరాలు > ప్రేమాయణం > ప్రేమ కవితలు > మనసు తోటకు విచ్చేసిన నేస్తమా...!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మనసు తోటకు విచ్చేసిన నేస్తమా...!
Lover
FileWD














కనులు మూసినవేళ కలలో నీవే
కనులు తెరచినవేళ కనిపించేదీ నీవే

మరచిపోదామనుకున్నవేళ జ్ఞాపకంలోనూ నీవే
వద్దని వెళ్లిపోతుంటే నీడవై వెంటాడేదీ నీవే

చేరుదామని పరుగులెడుతున్నవేళ దూరమయ్యేదీ నీవే
అలసిపోయి నే నిలబడితే రారమ్మని పిలిచేదీ నీవే

నాలోని ప్రేమ భావనకు పునాది నీవే
ఆ ప్రేమే నన్ను దహించేస్తుంటే చూస్తూ నవ్వుకునేదీ నీవే

మూగబోయిన నాలోని భావానికి అక్షరరూపం నీవే
అల్లుకున్న అక్షరాలను కవితలుగా ఏర్చి కూర్చిందీ నీవే

నేనంటూ బ్రతికున్నానంటే దానికి కారణం నీవే
ఏనాడైనా నే మరణిస్తానన్నది నిజమైతే దానికీ కారణం నీవే...
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
నా హృదయంలో నిదురించే చెలీ...
నీ జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి
నేనంటే ఎందుకింత "అ"ఇష్టం
వెన్నెల దేవతలా కదలివచ్చి...
ప్రియా నిన్నే తలచా...
ఆన్‌లైన్ డేటింగ్‌లలో జపాన్ తాతయ్యలు