కమ్మని కలవై వచ్చి ముద్దుగా మురిపిస్తావురావా నావెంట అంటూ నాలో ఆశలెన్నో రేపుతావుకలేనని తెలిసినా ఆనందంతో పరవశిస్తున్న ఆ క్షణాననిర్దయగా ఆ స్వప్నాన్ని చెరిపేసి పక్కుమని నవ్వేస్తావునీలోని ప్రాణమే నేనంటావు నీలోని ఆశసైతం నాకోసమేనంటావుమాటలతో మాయచేసి గుండెల్లో కుంపట్లు రగిలిస్తావునీలోని సగం నేనంటావు నువ్వుంటూ మొత్తంగా నేనేనంటావునీ గుండె చెసే చప్పుడు నేనంటావు నీలోని శ్వాస సైతం నేనంటావుఅంతలోనే ఏమౌతుందో తెలియదుగానీ... నీకు నేనా అంటూ ఎగతాళి చేసేస్తావునాలోని ప్రాణమే నీవని తెలిసినా దాంతోనే నీవు ఆటలాడేస్తావు |