ప్రియా నీ చూపులో ఉన్నది ప్రేమామృతంనీ నవ్వులో దాగున్నది గానామృతంనీవు పలికే ప్రతి మాటా నాకు వేదామృతంనీ నడకలోని ప్రతి అడుగు ఓ నృత్యామృతంఅందుకే చెలీ నా ప్రేమలో ఇంత ఆవేదనదానిని సాధించేందుకే ప్రతీక్షణం నాలో ఈ తపననీవే నా సర్వస్వం అని నీవే నా ప్రాణం అనినీవే నా లోకం అని అనుక్షణం కలల్లో విహరించాకానీ నువ్వు నా సొంతం కాగలవా అని నాకు ఎప్పటికీ సందేహమే నీవే లోకంగా ఎల్లకాలం నిన్ను ప్రేమించాలనివుందినీవే నా జీవితానికి గమ్యంగా నిన్ను అభిమానించాలనివుందినీవే నా ప్రేయసిగా ఎల్లప్పుడూ ఆరాదించాలనివుందికానీ నీకంటూ ఇష్టం లేకుంటే నా ప్రేమను ఎలా చెప్పగలను |