మోడ్రన్ అమ్మాయిల ప్రేమ ఎలా ఉంటుందో జర్నీలో అంజలిని చూస్తే తెలుస్తుంది. ఇటీవల ఈ భామ చెన్నైలోని ప్రిన్స్ జ్యుయలరీలో మెల్లేమాయ్ కలెక్షన్ను విడుదల చేసింది. ఈ సందర్భంగా అంజలి తన భావాలను పంచుకుంది. యాక్చువల్లీ అమ్మాయిలు వజ్రపు ధగధగలతో నిండిన ఆభరణాలు ఇష్టపడతారు. నా మటుకు నేను వజ్రాల ఆభరణాలను అతిగా ఇష్టపడతాను. డైమండ్ ఆభరణాల్లో కొత్త మోడళ్లను చూస్తే వాటిని ధరించే దాకా ఉండలేను అంటూ చెప్పింది అంజలి.