ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్, ఎస్.ఎస్. రావత్, ఎస్పీ శశిధర్ రెడ్డి, తితిదే సీవీఎస్ఓ హరికుమార్‌లు తిరుమలలో తనిఖీలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్సార్ రాకను పురస్కరించుకుని తిరుమలలో కలెక్టర్, ఎస్పీలు తనిఖీలు నిర్వహించారు.
ముఖ్యమంత్రి ట్రయల్ కాన్వాయ్ రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమల పద్మావతీ అతిథి భవనం, అక్కడి నుంచి శ్రీవారి ఆలయం వరకు జిల్లా ఎస్పీ శశిధర్ రెడ్డి నేతృత్వంలో సిబ్బంది తనిఖీలు చేశారు. ఉత్సవాలకు చేపట్టిన ఏర్పాట్లు, తిరుమలలోని నాలుగు మాడ వీధులు, శ్రీ వారి ఆలయం, ముఖ్యమంత్రి పర్యటించనున్న ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ తనిఖీలు నిర్వహించినట్లు తితిదే విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
|