ప్రధాన పేజి > ఇతరాలు > వెబ్‌దునియా స్పెషల్ 07 > శ్రీవారి బ్రహ్మోత్సవాలు
 
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక బస్సులు
శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 14 నుంచి (శుక్రవారం) నుంచి 24వ తేదీ వరకు 391 బస్సులను ప్రత్యేకంగా నడుపనున్నారు. ప్రతిరోజూ 391 బస్సులు తిరగనున్నాయని ఆర్టీసీ అధికారులు చెప్పారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి మాత్రమే కాకుండా పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు కర్ణాటక, కేరళల నుంచి ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు వారు అన్నారు.

19వ తేదీన జరిగే గరుడోత్సవానికి ప్రతి నిమిషానికి రెండు బస్సులు తిరిగే విధంహా ఆర్టీసీ యంత్రాంగం చర్యలు చేపట్టిందని ఆర్టీసీ శాఖ అధికారిక వర్గాలు వెల్లడించాయి. పొరుగు రాష్ట్రమైన తమిళనాడులోని చెన్నై, పాండిచ్చేరి, కంచి, వేలూరు, విల్లుపురం వంటి ప్రాంతాల నుంచి 90కి మించిన బస్సు సర్వీసులను నడుపనున్నారు.

అదేవిధంగా కర్ణాటకలోని మైసూర్, బెంగళూరు నుంచి 10కి మించిన బస్సు సర్వీసులను ఏర్పాటు చేయనున్నారు. చిత్తూరు డివిజన్ నుంచి 270 బస్సు సర్వీసులు, తిరుపతి డివిజన్ నుంచి 270 బస్సు సర్వీసులు, కడప, నెల్లూరు డివిజన్ల నుంచి రోజూ 55కి మించిన బస్సు సర్వీసులను ఏర్పాటు చేస్తామని ఆర్టీసీ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
మరిన్ని
ముఖ్యమంత్రి రాకకు తిరుమలలో భారీ భద్రత
తిరుమలలో జిల్లా కలెక్టర్, ఎస్పీ తనిఖీలు
శ్రీవారి బహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ
శ్రీవారి బ్రహ్మోత్సవ వివరాలు
డేగ కన్ను వలయంలో 'శ్రీవారి' బ్రహ్మోత్సవాలు
భక్తకోటివద్దకు వేంచేసే మలయప్ప స్వామి