ఈ నెల 15వ తేదీన ప్రారంభం కానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా రైళ్ళలో అదనపు కోచ్‌లను ఏర్పాటు చేయనున్నామని ఏరియా అధికారి స్వామి నాయక్ విలేకరులతో చెప్పారు. తిరుపతికి చేరుకునే ప్రతిరైలుకు 24 కోచ్‌లు ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.
18 కోచ్‌లతో ఉండే రైళ్లకు అదనంగా ఆరు కోచ్‌లను ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సుదూర ప్రాంతాల నుంచి తిరుపతికి చేరుకునే భక్తులకు మెరుగైన సేవలు అందించే దిశగా అన్నీ రకాల చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. రైల్వేస్టేషన్లో అనుమానిత వస్తువులు కన్పిస్తే ప్రయాణికులు రైల్వే యంత్రాంగానికి తెలియజేయాలని కోరారు.
|