తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అత్యంత వైభవంగా నిర్వహించే శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఐదు ప్రధాన ఛానళ్లలో ప్రసారం చేయడానికి అనుమతినిచ్చింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలు శనివారం ప్రారంభం కానున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయంలోని నాలుగు మాడవీధుల్లో జరిగే ఉత్సవాలను ప్రసారం చేసేందుకు తగిన ఏర్పాట్లను చేసామని టీటీడి ఈవో కేవి.రమణాచారి విలేకరులతో మాట్లాడుతూ.. శ్రీవారి ఉత్సవాలను ప్రత్యక్ష ప్రసారానికి అనుమతి ఇచ్చామన్నారు.
ముఖ్యంగా.. భద్రత కారణాల దృష్ట్యా పరిమితమైన నిబంధనలతో ఐదు టీవీ ఛానళ్లకు అనుమతినిచ్చామన్నారు. డీడీకి ఎనిమిది పాయింట్లను, మిగిలిన ప్రైవేట్ ఛానెళ్లకు ఆరు పాయింట్లతో ప్రసారం చేసే అనుమతినిచ్చామని ఆయన అన్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా ధ్వజారోహణం, స్నాపన తిరుమంజనం వంటి కార్యక్రమాల క్లిప్పింగ్స్‌ను ప్రైవేట్ టీవీ ఛానళ్లకు దూరదర్శన్ (డిడి) అందజేస్తుందని ఆయన చెప్పారు.
|